Seemantham: గర్భిణీలపై.. దాడుల నేపథ్యంలో థ్రిల్లర్ ‘Cమంతం’
ABN, Publish Date - Nov 09 , 2025 | 07:37 PM
వజ్రయోగి, శ్రేయ భర్తీ ప్రధాన పాత్రల్లో నటించిన సీమంతం చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.
టీ.ఆర్. డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘సీమంతం’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వజ్రయోగి హీరోగా, శ్రేయ భర్తీ హీరోయిన్‌గా నటించగా, సుధాకర్ పాణి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా ఈ సినిమా రూపొందింది. సంగీతాన్ని ఎస్. సుహాస్ అందించారు. ఇప్పటికే విడుదలైన సీమంతం టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. గర్భిణీలపై జరిగే దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్, ఇంటెన్స్ ట్రీట్‌మెంట్ మరియు గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర బృందం తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో వజ్రయోగి మాట్లాడుతూ.. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సీమంతం చేశాను. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న మా సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా రూపొందింది. సుహాస్ సంగీతం, అమర్ ఎడిటింగ్, సుధాకర్ దర్శకత్వం అన్నీ కలసి ఒక కొత్త అనుభూతి ఇస్తాయి. మా టీమ్‌కి ఇది పెద్ద విజయం అవుతుందని నమ్ముతున్నా అన్నారు. హీరోయిన్ శ్రేయ భర్తీ మాట్లాడుతూ: ఈ సినిమాతో లాంచ్ అవ్వడం నాకు చాలా స్పెషల్. ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి, వజ్రయోగి గారికి థాంక్స్. సీమంతం అందరికీ నచ్చే థ్రిల్లింగ్ అనుభూతి ఇస్తుంది” అన్నారు.
దర్శకుడు సుధాకర్ పాణి మాట్లాడుతూ: సీమంతం హీరో వజ్రయోగి నా కాలేజ్ ఫ్రెండ్. ఆయనతో సినిమా చేయడం నాకు గర్వంగా ఉంది. సుహాస్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కెమెరామెన్ శ్రీనివాస్ అందించిన విజువల్స్ సినిమాలో మరో లెవల్‌లోకి తీసుకెళ్తాయి. నవంబర్ 14న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా అన్నారు. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ మాట్లాడుతూ: ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బీజీఎం చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా వచ్చింది. దర్శకుడు, నిర్మాతలు నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. నవంబర్ 14న థియేటర్లలో సీమంతం చూసి మా టీమ్‌కి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఈ సినిమా నా కెరీర్‌లో కీలకమైనది. నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. సుధాకర్ గారు మంచి విజన్‌తో సినిమా తీశారు. వజ్రయోగి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. సీమంతం ప్రేక్షకులకు కొత్త థ్రిల్లింగ్ అనుభూతి ఇస్తుందన్నారు. కో-ప్రొడ్యూసర్ గాయత్రి సౌమ్య మాట్లాడుతూ: “ఎన్నో ఒడిదుడుకుల తరువాత సీమంతం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తవారిగా మాకు ఇది పెద్ద అడుగు. మా సినిమా థ్రిల్లర్ జానర్‌లో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు” అన్నారు.