Mana Shankara Vara Prasad Garu: మరో లవ్లీ సాంగ్ తో జనం ముందుకు చిరు, నయన్
ABN, Publish Date - Dec 04 , 2025 | 05:19 PM
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుండి సెకండ్ సింగిల్ మరో నాలుగు రోజుల్లో రాబోతోంది. ఈ పాటకు భీమ్స్ స్వరాలు అందించగా, అనంత శ్రీరామ్ రాశాడు. ఈ సాంగ్ ప్రోమో డిసెంబర్ 6న రానుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) నుండి వచ్చిన 'మీసాల పిల్లా...' మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మూవీ రిలీజ్ కు ముందే ఈ పాట ఏకంగా 76 మిలియన్ వ్యూస్ ను ఇప్పటి వరకూ అందుకుంది. సీనియర్ తెలుగు హీరోస్ లోనే ఇంత ఫాస్ట్ గా ఈ మార్క్ ను అందుకున్న సాంగ్ మరొకటి లేదు. ఈ పాటకు వచ్చిన క్రేజ్ బట్టే 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ పట్ల జనాలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమౌతుంది. నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) సైతం ఓ కీలక పాత్రను పోషించడం విశేషం. ఇటీవలే చిరంజీవి, వెంకటేశ్ మీద ఓ పాట చిత్రీకరణ పూర్తి చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఇదిలా ఉంటే... 'మీసాల పిల్ల' పాటకు వచ్చిన స్పందన దృష్టిలో పెట్టుకుని తాజాగా 'శశిరేఖా...' అనే సెకండ్ సింగిల్ ను 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రబృందం రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తెలిపారు. డిసెంబర్ 6న సాంగ్ ప్రోమోను, 8వ తేదీన లిరికల్ వీడియోను విడుదల చేస్తామని చెప్పారు.
భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. దీన్ని మధుప్రియతో కలిసి భీమ్స్ పాడారు. వెంకటేశ్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'గోదారి గట్టుమీద..' నూ మధుప్రియ... రమణ గోగుల (Ramana Gogula) తో కలిసి పాడింది. ఇప్పుడు ఆమెకు భీమ్స్ అండ్ అనిల్ రావిపూడి మరోసారి అవకాశం ఇచ్చారు. 'శశిరేఖా...' సాంగ్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ నిర్వహించారు. సో... సాంగ్ రావడానికి నాలుగు రోజుల ముందునుండే మేకర్స్ క్రేజ్ ను క్రియేట్ చేసే పని మొదలు పెట్టారు. మరి సంక్రాంతి బరిలో చిరంజీవి, అనిల్ రావిపూడి ఫస్ట్ కాంబో మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' ఎన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.