సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raobahadur Teaser: ప్రపంచానికి తెలియాల్సిన కథ

ABN, Publish Date - Aug 13 , 2025 | 05:09 AM

సత్యదేవ్‌ కథానాయకుడిగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్‌ వెంకటేశ్‌ మహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావుబహదూర్‌’. మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ సమర్పణలో...

సత్యదేవ్‌ కథానాయకుడిగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్‌ వెంకటేశ్‌ మహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావుబహదూర్‌’. మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌చంద్ర నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. రాజవంశం నేపథ్యంలో సాగే సైకలాజికల్‌ డ్రామాగా సినిమా ఉండనుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేశ్‌ మహా మాట్లాడుతూ ‘‘ప్రపంచానికి తెలియాల్సిన తెలుగువారి కథ ఇది’ అని అన్నారు. ‘ఓ నటుడిగా ఇలాంటి పాత్రను పోషిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని హీరో సత్యదేవ్‌ అన్నారు. ఈ నెల 15న టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్‌. వచ్చే ఏడాది వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Aug 13 , 2025 | 05:09 AM