Rao Bahadur: సత్యదేవ్.. ‘రావుబహదూర్’ టీజర్ ఈ రేంజ్‌లో ఉందేంటి
ABN, Publish Date - Aug 18 , 2025 | 12:03 PM
సత్యదేవ్ హీరోగా నటించిన ‘రావుబహదూర్’ చిత్రం టీజర్ విడుదలైంది.
గతంలో ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ వెంకటేశ్ మహా (Venkatesh Maha) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావుబహదూర్’(Rao Bahadur). ఇటీవల కింగ్డమ్ చిత్రంతో అలరించిన సత్యదేవ్ (Satyadev) హీరోగా మరో వినూత్న ప్రయోగంతో రెండు భిన్నమైప పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మహేశ్‌బాబు(Mahesh Babu), నమ్రత శిరోద్కర్ నిర్మాణ సంస్థ జీఎమ్బీ ఎంటర్ టైన్‌మెంట్ (GMB Entertainment) సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే గత వారం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేయగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను సోమవారం దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు.
వృద్ధుడి గెటప్‌లో, రాజా గెటప్‌లో ఓ సత్యదేవ్ లుక్ వావ్ అనేలా ఉంది. ఈ టీజర్ సైతం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మించి ఓ కొత్త జానర్‌లో సినిమాను రూపొందించినట్లు ఇట్టే అర్ధమవుతోంది. రాజవంశం నేపథ్యంలో సాగే సైకలాజికల్ డ్రామాగా సినిమా ఉండనుందని స్పష్టంగా తెలుస్తోంది. పాత్రలు, పాత్రధారులు అన్ని చాలా వెరైటీగా ఉండి సినిమాలో సమ్‌థింగ్ ఏదో ఉందనేలా ఫీల్ ఇస్తున్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్పెప్ట్‌తో థ్రిల్లంగి రైడ్‌లా టీజర్ కట్ చేశారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్ చూసిన వారంతా సత్యదేవ్.. అసలు ఏం ఫ్లాన్ చేశావు సామి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.