సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satyadev Credits: నాకు గొప్ప పేరు తెచ్చిన చిత్రమిది

ABN, Publish Date - Aug 04 , 2025 | 06:09 AM

‘కింగ్‌డమ్‌’ సినిమా మొదటి ఆట చూసినప్పటి నుంచి ప్రేక్షకులు, స్నేహితులు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నటుడిగా నాకు గొప్ప పేరు తెచ్చిన చిత్రమిది’ అని...

‘కింగ్‌డమ్‌’ సినిమా మొదటి ఆట చూసినప్పటి నుంచి ప్రేక్షకులు, స్నేహితులు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నటుడిగా నాకు గొప్ప పేరు తెచ్చిన చిత్రమిది’ అని సత్యదేవ్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రేక్షకాఽధరణతో కొనసాగుతోన్న సందర్భంగా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన సత్యదేవ్‌ మీడియాతో మాట్లాడారు. ‘శివ పాత్ర కోసం దర్శకుడు గౌతమ్‌ మొదట నా పేరే రాసుకున్నారట. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పాను. యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్‌ ఉండాలని నేను నమ్ముతాను. ‘కింగ్‌డమ్‌’లో అలాంటి ఎమోషన్‌ ఉంది కాబట్టే నా యాక్షన్‌ సీన్స్‌కి అంత మంచి స్పందన వస్తోంది. ప్రీ క్లయిమాక్స్‌ ఎపిసోడ్‌ కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూశాక..ఆ కష్టమంతా మరచిపోయాను’ అని సత్యదేవ్‌ చెప్పారు.

Updated Date - Aug 04 , 2025 | 06:09 AM