Malavika Manoj: సత్యభామ అందర్నీ అలరిస్తుంది
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:14 AM
హీరో సుహాస్ తాజాగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఓ భామ అయ్యో రామ...
హీరో సుహాస్ తాజాగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ఈ చిత్రంతో మాళవిక మనోజ్(జో ఫేమ్) తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. సినిమా ఈ శక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాళవిక పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో ఆధునికంగా ఉంటుంది. సత్యభామ అనే పాత్రలో కనిపిస్తాను. అందర్నీ అలరించే పాత్ర నాది. నా రియల్ లైఫ్‌కు ఎలాంటి పోలిక లేని పాత్ర సత్యభామ. తెలుగులో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకెప్పుడూ వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించాలని ఉంటుంది. సాధారణంగా అన్ని సినిమాల్లో ఉండే ప్రేమ సన్నివేశాలు ఈ సినిమాలోనూ ఉన్నాయి. అయితే ఇందులోని సన్నివేశాల్లో కొత్త అనుభూతి ఉంటుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. అన్ని పాటలు నా మనసుకు హత్తుకున్నాయి. గ్లామరస్ రోల్స్ చేయాలా? వద్దా? అనే నిబంధన పెట్టుకోలేదు. ఇప్పటి వరకూ కథ నచ్చి, సౌకర్యంగా అనిపించిన పాత్రలు మాత్రమే చేశాను. నాకు నచ్చని క్యారెక్టర్స్‌ని నేను చేయను’ అని అన్నారు.