Janhvi kapoor: దేశాన్ని పొగడడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ ఉండదు
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:29 PM
ముంబైలో జరిగిన కృష్ణాష్టమి వేడులకు శ్రీదేవి తనయ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టారు.
ముంబైలో జరిగిన కృష్ణాష్టమి వేడులకు శ్రీదేవి తనయ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టారు. అయితే, ‘భారత్ మాతాకీ జై’ అంటూ జాన్వీ ఉట్టి కొట్టడంతో కొందరు ఆమెను ట్రోల్స్ చేశారు. మేడమ్ మీరు వచ్చింది కృష్ణాష్టమి (KRISHNASTAMI) వేడుకలకు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు కాదు.. అది వేరు.. ఇది వేరూ అంటూ ఎక్స్‌లో జాన్వీపై కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. (Janhvi Kapoor trolling)
‘శ్రీకృష్ణాష్టమి’ వేడుకలో పాల్గొన్న చాలామంది ఉట్టి కొట్టడానికి ముందు ‘భారత్ మాతాకీ జై’ అన్నారు. వారితో పాటు నేనూ అన్నాను. వారు అన్న వీడియో క్లిప్ కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారు. అయినా దేశాన్ని పొగడడానికి ఒక రోజంటూ ప్రత్యేకంగా ఉండదు. జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. నేను ప్రతిరోజూ ‘భారత్ మాతాకీ జై’ అని చెబుతాను. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉందా’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘పరమ్ సుందరి’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరింది. రొమాంటిక్ కామెడీగా నటించిన ఈ చిత్రంలో సిద్థార్థ్ మల్హోత్ర కథానాయకుడు. తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్థార్థ్ కనిపించనున్నారు.
Rahul Sipligunj: హరిణ్యా రెడ్డితో.. రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం! షాక్‌లో ఫ్యాన్స్