Sarathkumar: కన్నప్పలో మా తండ్రీకొడుకుల బంధం అద్భుతంగా ఉంటుంది
ABN, Publish Date - Jun 21 , 2025 | 07:24 PM
మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప(Kannappa).
Sarathkumar: మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప(Kannappa). మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెట్టి సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తుంది.
తాజాగా కన్నప్ప చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించిన కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ సినిమా గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడాడు. ఈ సినిమాలో తాను మంచు విష్ణు తండ్రిగా నటిస్తున్నానని, వారిద్దరి మధ్య అనుబంధం అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. " నతనాధుడు.. తిన్నడు తండ్రి. ఈ స్టోరీ కథ వినిపించినప్పుడే నాకు నచ్చింది. ఇదొక బ్యాక్ స్టోరీ. కన్నప్ప పెద్ద శివ భక్తుడు ఎలా అయ్యాడు అనేది ఈ సినిమాలో చెప్పబోతున్నారు. విష్ణు వెర్షన్ ఆఫ్ కన్నప్ప అని చెప్పొచ్చు. విష్ణు వెర్షన్ అంటే.. ఇమాజిన్ చేసి నాన్ బిలీవర్- బిలీవర్ పోరాటం ఉంటేనే పిక్చర్ సరిగ్గా ఉంటుంది.
ఇది కాకుండా చెప్పాలంటే వన్ లైన్ స్టోరీ. కన్నప్ప కన్నును పొడుచుకోవడం, రక్తం వచ్చింది అనేది ఒక్క లైన్ లో చెప్పేయొచ్చు. ఇక ఈ కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే మాగ్నమ్ ఓపస్ పిక్చర్ ఉండాలి. శివ భక్తుడు ఇలా ఉండాలి. శివుడి పాయింట్ ఆఫ్ వ్యూ, తండ్రీకొడుకుల బంధం. తిన్నా, నతనాధుడు మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కొడుకును తండ్రి అర్ధం చేసుకుంటాడు. కానీ, అదే సమయంలో ఈ క్లాన్స్ ఏమైపోతాయి. కొడుకు మారడం లేదు. తండ్రి తరువాత కొడుకే కదా చూసుకోవాలి ఇవన్నీ అతని మైండ్ లో ఉంటాయి. అవి కాకుండా కొడుకు మీద అమితమైన ప్రేమ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఒక పాయింట్ లో తిన్నా వస్తే బావుంటుంది అంటే.. నేను తిన్నడు వస్తాడు అని చెప్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
రీల్ నే కాదు రియల్ లో కూడా మోహన్ బాబు, విష్ణు అంటే నాకు ఎంతో ప్రేమ. మేమందరం ఒక ఫ్యామిలీ. సినిమా షూటింగ్ మొత్తం వెకేషన్ లా జరిగింది. కాకపోతే ఈ ప్రొడక్షన్ హౌస్ అంతా చాలా ప్లాన్ చేసింది. న్యూజిలాండ్ వెళ్లి షూట్ చేయడం అంటే చాలా కష్టం. అంత చలిగా ఉన్న ప్రదేశంలో 130 రోజులు ఉండి షూటింగ్ చేయడం అంటే చాలా కష్టం. అక్కడ ఆర్టిస్టులను ఒక దగ్గరికి తీసుకురావడం.. అదేమీ ఈజీ పని కాదు. కానీ, మోహన్ బాబు, విష్ణు డెడికేషన్, డిసిప్లేన్.. డైరెక్టర్, కెమెరా మెన్ అందరూ స్పీడుగా చేయడానికి హెల్ప్ చేశారు. కన్నప్ప సౌత్ కి అందరికీ తెలుసు. ఇప్పుడు నార్త్, సౌత్ వెస్ట్ కి కూడా తెలిసే అవకాశం ఇప్పుడు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.
Manisha Koirala: రజినీకాంత్ వలనే కెరీర్ పోయిందన్న హీరోయిన్