Ram Miriyala: 'సంతాన ప్రాప్తిరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు..

ABN, Publish Date - Nov 04 , 2025 | 03:19 PM

'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..', 'టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..', 'టికెట్ ఏ కొనకుండా..', 'సుఫియానా...' ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి.

'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..', 'టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..', 'టికెట్ ఏ కొనకుండా..', 'సుఫియానా...' ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి. ఆయన  పాడితే  ఛాట్ బస్టర్ కావాల్సిందే అని నిరూపించుకున్నారు. తాజాగా 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana PrapthiRasthu) టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు.  'సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు...సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్ లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు...' అంటూ ప్రస్తుత కాలంలో యూత్ మ్యారీడ్ లైఫ్ స్టైల్ ను చూపిస్తూ సాగుతుందీ పాట. 


విక్రాంత్, చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన చిత్రమిది. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  

ALSO READ: Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

Phoenix: విజయ్ సేతుపతి కొడుకు కోసం మెగాఫోన్ పట్టిన అనల్ అరసు

Mastiii 4 : నవ్వులు పూయిస్తున్న మస్తీ 4 ట్రైలర్‌

Updated at - Nov 04 , 2025 | 04:10 PM