Gamblers: సంగీత్ శోభన్ వర్సెస్ నార్నే నితిన్... ఏం జరుగబోతోంది...

ABN , Publish Date - May 23 , 2025 | 01:29 PM

'మ్యాడ్', 'మ్యాడ్ స్వ్కేర్'లో కలిసి నటించిన సంగీత్ శోభన్, నార్నే నితిన్ ఇప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు. ఇద్దరి సినిమాలూ జూన్ 6నే విడుదలకు సిద్థమౌతున్నాయి.

'మ్యాడ్' (MAD), 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) చిత్రాలతో యూత్ లో చక్కని క్రేజ్ ను సంపాదించుకున్నారు సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), నార్నే నితిన్ (Narne Nithin), నితిన్ రామ్ (Nithin Ram). ఈ రెండు సినిమాలకు మధ్యలో నార్నే నితిన్ నటించిన 'ఆయ్' (Aay) కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. 'మ్యాడ్'లో ఈ ముగ్గురిలో కాస్తంత ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంగీత్ శోభన్ కు ఇవ్వగా... ఇటీవల విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్'లో నార్నే నితిన్ పాత్రకు కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం మీద ముగ్గురు యంగ్ హీరోస్ ఈ రెండు సినిమాల్లోనూ పోటాపోటీగా నటించి, మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు నార్నే నితిన్, సంగీత్ శోభన్ నటించిన రెండు సినిమా బాక్సాఫీస్ బరిలో ఒకదానితో ఒకటి పోటీ పడే పరిస్థితి ఎదురైంది.


నార్నే నితిన్ 'మ్యాడ్' కంటే కూడా ముందు సతీశ్ వేగశ్న దర్శకత్వంలో 'శ్రీశ్రీశ్రీ రాజావారు' (Sri Sri Sri Rajavaaru) అనే చిత్రంలో సోలో హీరోగా నటించాడు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూన్ 6న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత చింతపల్లి రామారావు తెలిపారు.

WhatsApp Image 2025-05-17 at 15.27.48 (1).jpeg

అంతవరకూ బాగానే ఇప్పుడు తాజాగా అదే రోజున సంగీత్ శోభన్ నటిస్తున్న 'గ్యాంబ్లర్స్' (Gamblers) అనే మూవీని జూన్ 6న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 'మ్యాడ్' సినిమాకు వచ్చిన క్రేజ్ తో సంగీత్ శోభన్ కూడా పలు చిత్రాలు, వెబ్ సీరిస్ లలో నటించాడు. అందులో 'గ్యాంబ్లర్స్' కూడా ఒకటి.

sangeeth.jpeg

గతంలో ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ తో 'శ్రీవల్లీ' (Srivalli) అనే సినిమాను నిర్మించిన సునీత, రాజ్ కుమార్ బృందావనం 'గ్యాంబ్లర్స్' మూవీని నిర్మించారు. కె.ఎస్.కె. చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగా హీరోయిన్ గా నటించింది. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్‌, పృథ్వీరాజ్ బన్న, సాయిశ్వేత, జస్విక, భరణీ శంకర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయని, ఇదో మిస్టరీ ఎంటర్ టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఓ కొత్త సంగీత్ శోభన్ ను ఆడియెన్స్ చూస్తారని తెలిపారు. ఇందులోని థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్స్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తాయని, పూర్తి వైవిధ్యమైన కాన్పెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇదని అన్నారు.


మరి జూన్ 6వ తేదీనే నార్నే నితిన్ 'శ్రీశ్రీశ్రీ రాజావారు', సంగీత్ శోభన్ 'గ్యాంబ్లర్స్' చిత్రాలు జనం ముందుకు వస్తే వారు దేనికి ఓటేస్తారో చూడాలి.

Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్‌.. బ‌రిలోకి దిగుతున్నాడు

Also Read: Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 ల‌క్ష‌లు... చిక్కుల్లో డ్రాగ‌న్ బ్యూటీ... లిక్క‌ర్ స్కాంలో పేరు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 23 , 2025 | 01:56 PM