సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sandeep Reddy Vanga: స్పిరిట్ లో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. వంగా ఏమన్నాడంటే

ABN, Publish Date - Nov 12 , 2025 | 06:49 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Spirit

Sandeep Reddy Vanga: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ లోనే స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని వంగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ, అది ఆలస్యం అవుతూనే వస్తుంది. ఇక ఈలోపు ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి నటిస్తుందని, వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చి అభిమానులను చల్లబర్చాడు. డార్లింగ్ బర్త్ డే రోజున ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు.

ఇక ఎప్పటి నుంచో స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ కు తండ్రిగా చిరు నటిస్తున్నాడని ఇండస్ట్రీలో ఒక వార్త సెన్సేషన్ సృష్టిస్తూనే వస్తుంది. వంగ .. మెగాస్టార్ కు వీరాభిమాని. ఆయన ఫోటో వంగా ఆఫీస్ లోనే పెట్టుకున్నాడు. ఈమధ్యనే చిరును వంగా కలవడం కూడా జరిగింది. దీంతో నిజంగానే స్పిరిట్ చిరు నటిస్తున్నాడు అని రూమర్స్ బాగా వ్యాపించాయి.

తాజాగా ఈ రూమర్స్ కు వంగా చెక్ పెట్టాడు. చిన్న సినిమా అయిన జిగ్రీస్ కు సందీప్ సైలెంట్ గా సపోర్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జిగ్రీస్ హీరోస్ అందరూ కలిసి సందీప్ ఆఫీస్ కు వెళ్లి తమకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్స్ చెప్పారు. ఇక ఆ సమయంలోనే స్పిరిట్ గురించి బయట వినిపిస్తున్న ప్రశ్నలను అడిగారు. స్పిరిట్ లో చిరంజీవి.. ప్రభాస్ కు తండ్రిగా నటిస్తున్నారు అంట నిజమేనా అన్న ప్రశ్నకు సందీప్ అవన్నీ రూమర్స్.. చిరంజీవి ఏమి స్పిరిట్ లో నటించడం లేదు. ఆయనతో సోలోగా ఒక సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. మరి చిరుతో సందీప్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Updated Date - Nov 12 , 2025 | 07:02 PM