Sandeep Reddy Vanga: సందీప్ వంగ చిన్న సినిమా ప్లాన్

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:35 PM

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. కొత్త తరానికి తానే బాసటగా నిలువబోతున్నాడు. చేతిలో బిగ్ ప్రాజెక్ట్ పెట్టుకొని మరి ఓ స్మాల్ ప్రాజెక్ట్ ను టేకప్ చేయాలనుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga ) టాలీవుడ్‌లోనే‌ కాదు బాలీవుడ్ లోనూ ఓ సంచలనం‌. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ ( Arjun Reddy) తో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించిన ఈ డైరెక్టర్, 'కబీర్ సింగ్' (Kabir Singh), ‘యానిమల్’ (Animal) సినిమాలతో బాలీవుడ్‌ను కూడా షేక్ చేశాడు. తనదైన రా ఎమోషన్స్‌తో సినిమాలను తెరకెక్కించడంలో సందీప్ వంగా సిద్ధహస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) తో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంతో పాటు, సందీప్ ఓ స్మాల్ బడ్జెట్ సినిమాను కూడా ప్లాన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.


యంగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇవ్వడానికి ఓ చిన్న సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడట సందీప్ వంగా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన వేణు (Venu) ను డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి హీరోగా ‘మేం ఫేమస్’ (Mem Famous) ఫేమ్ సుమంత్ ప్రభాస్‌ (Sumanth Prabhas) ను ఎంచుకున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ ఫిల్మ్ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీగా రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ కోసం సెర్చ్ జరుగుతోంది. ఆమె ఎంపిక కూడా పూర్తి కాగానే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించే ఆస్కారం ఉంది.

సందీప్ రెడ్డి సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ నుంచి వచ్చే సినిమా అంటే, అది ఎలాంటి జానర్ అయినా, ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుందనేది అందరి నమ్మకం. అందుకే ఈ చిన్న సినిమా కూడా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం ఖాయమని అంటున్నారు. ఏదేమైనా ఓ వైపు భారీ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తూనే, చిన్న సినిమాను కూడా నిర్మిస్తూ ఇప్పుడు సందీప్ వంగ టాప్ ది ఇండస్ట్రీగా మారాడు.

Read Also: OG Trailer: ముంబైకి వస్తున్నా.. తలలు జాగ్రత్త.. ట్రైలర్‌ ఊపేస్తుంది.

Read Also: Manchu Manoj: అయోధ్య నుంచి 'మిరాయ్' సక్సెస్ టూర్ 

Updated Date - Sep 22 , 2025 | 05:35 PM