సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samyuktha: రూట్ మార్చిన సంయుక్త‌.. ఫుల్ యాక్ష‌న్ మోడ్

ABN, Publish Date - Oct 20 , 2025 | 06:53 AM

కథానాయికగా వరుస విజయాలను అందుకొంటు దూసుకుపోతుంది సంయుక్త మీన‌న్.

Samyuktha

కథానాయికగా వరుస విజయాలను అందుకొంటు దూసుకుపోతుంది సంయుక్త మీన‌న్ (Samyuktha ). కెరీర్‌లో తొలిసారి ఆమె ప్రధాన పాత్రధారిణిగా స్ట్రెయిట్ తెలుగులో ఓ మహిళా ప్రాధాన్య చిత్రం తెరకెక్కుతోంది. హ‌స్య మూవీస్ (Hasya Movies) బ్యాన‌ర్‌పై రాజేశ్‌ దండా (Rajesh Danda) నిర్మిస్తున్నారు. సింధు మాగంటి సహ నిర్మాత. సంయుక్త స్వయంగా సమర్పిస్తున్నారు.

17 ఏండ్ల క్రితం వెంక‌టేశ్‌తో చింత‌కాయ‌ల ర‌వి (Chintakayala Ravi) అనే విజ‌య‌వంత‌మైన‌ సినిమాను తెర‌కెక్కించిన యోగేశ్‌ కేఎంసీ (YOGESH KMC) దర్శకుడిగా మ‌రోమారు రీ ఎంట్రీ ఇస్తుండం విశేషం. తాజాగా మేకర్స్‌ ఈ చిత్రానికి ‘ది బ్లాక్‌ గోల్డ్‌’ (The Black Gold) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. దీపావళి సందర్భంగా చిత్రబృందం కొత్త లుక్‌ను నేడు విడుదల చేయనుంది.

ఔట్ అండ్ ఔట్ ఫుల్ యాక్ష‌న్ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంయుక్త యాక్షన్‌ రోల్‌లో అలరించనున్నారు, పోరాట ఘట్టాల్లో ఆమె నటన ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌, సినిమాటోగ్రఫీ: ఎ. వసంత్‌.

Updated Date - Oct 20 , 2025 | 06:53 AM