Pawan Kalyan: సముద్రఖనితో పవన్ రెండోసారి ..?
ABN , Publish Date - Jun 12 , 2025 | 09:01 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. అయ్యయ్యో మళ్లీ పవన్ ను వెండితెరపై చూడలేమా.. ? అనుకున్న సమయంలో రీఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇక రాజకీయాల్లో ఉండగానే మూడు సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ చేస్తున్న సమయంలోనే పదవి చేతికి వచ్చింది. దీంతో ఆ మూడు సినిమాలు ఆగిపోయినట్టేనా అని అనుకున్నారు. కానీ, రెండు సినిమాలను ఫినిష్ చేసి .. మూడో సినిమా షూటింగ్ సెట్ లో అడుగుపెట్టి సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఇక ఈ మూడు సినిమాలు మాత్రమే పవన్ చేస్తాడు. ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకు అంకితమవుతాడు అనుకోని నిరాశ పడేలోపే.. మరో రెండు సినిమాలను లైన్లో పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇది పవన్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ అని చెప్పాలి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) తో బిజీగా ఉన్న పవన్ త్వరలో మరో కొత్త సినిమాను ప్రకటించనున్నట్లు సమాచారం.
Tiger Shroff: అండర్ వేర్ తో క్రికెట్ ఆడిన బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్
కోలీవుడ్ డైరెక్టర్, నటుడు సముద్ర ఖని(Samuthirakani) దర్శకత్వంలో పవన్ ఒక సినిమాకు ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో బ్రో(Bro) అనే సినిమా వచ్చింది. సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన వినోదాయ సీతం(Vinodhaya Sitham) సినిమాకు రీమేక్ గా బ్రో సినిమాను తెరకెక్కించారు. సాయి ధరమ్ తేజ్, పవన్ కలిసి నటించిన ఈ సినిమా 2023 లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా తరువాత సముద్రఖని.. పవన్ సోలో హీరోగా ఒక కథను రాసుకున్నాడట. ఇది పవన్ కూడా విన్నాడని, ఆయనకు నచ్చడంతో ఓకే కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్, సముద్రఖనితో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను కూడా నిలబెట్టుకోవడానికి పవన్ సిద్దమయ్యినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనేది చూడాలి.