Tiger Shroff: అండర్ వేర్ తో క్రికెట్ ఆడిన బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్

ABN , Publish Date - Jun 12 , 2025 | 07:36 PM

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు.

Tiger Shroff

Tiger Shroff: బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక టైగర్ ష్రాఫ్ అంటే టక్కున గుర్తొచ్చేది అతని బాడీ. ఎప్పుడు  ఫిట్ గా కనిపిస్తూ  అందరికీ షాక్ కు గురిచేస్తూనే ఉంటాడు. తన ప్రతి సినిమాలో షర్ట్ లెస్ సాంగ్ కానీ, ఫైట్ కానీ కచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు విజయాలను అందుకున్న ఈ హీరో ఇప్పుడు మంచి హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. 

 

 

ఇక గత కొన్నాళ్లు హీరోయిన్ దిశా పటానీ(Disha Patani)తో రిలేషన్ లో ఉన్న టైగర్ ష్రాఫ్.. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్(Akshay Kumar) ఎంత మంచి స్నేహితులో అందరికీ తెల్సిందే.  అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి క్రికెట్ ఆడారు., వీరితో పాటు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా ఉన్నాడు. ఈ క్రికెట్ ఆడడమే టైగర్ ష్రాఫ్ ను విమర్శలు పాలయ్యేలా చేసింది. క్రికెట్ ఆడితే విమర్శలు ఎందుకు అని అంటే.. టైగర్ అండర్ వేర్ మాత్రమే వేసుకొని గేమ్ ఆడాడు కాబట్టి.

 Tollywood Heroes:  విమాన ప్రమాదం... స్పందించిన బాలకృష్ణ - చిరంజీవి 

 

బ్రిఫ్స్ అండర్ వేర్ తో కుర్ర హీరో బ్యాట్ పట్టుకొని బాల్ ను పరుగులు పెట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను టైగర్ పోస్ట్ చేస్తూ.. " దీనికి ఎటువంటి టెక్నిక్ లేదు.. అది నాకు బాగా తెలుసు" అని క్యాప్షన్ పెట్టాడు. సిక్సర్ కొట్టడానికి టెక్నీక్ అవసరం లేదు అని చెప్తున్నట్లు వీడియోను బట్టి అర్ధమవుతుంది. ఇక ఆ సిక్సర్ గురించి ఎవరు పట్టించుకోలేదు.. కేవలం టైగర్ ష్రాఫ్ అండర్ వేర్ మీద గేమ్ ఎందుకు ఆడుతున్నాడు అనేది మాత్రమే చర్చకు వచ్చింది. అయితే ఈ కుర్ర హీరో ఎందుకు ఇలా  అర్ధనగ్నంగా ఆడుతున్నాడు అనేది తెలియదు. ఒకవేళ తన బాడీని చూపించడానికా.. ? లేక వేరే కారణం ఉందా.. ? అనేది తెలియాలి. ఇక ఈ వీడియోపై పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ ఫిట్ నెస్ ను ఇలా చూపించడానికి దైర్యం కావాలి. చాలా కాన్ఫిడెన్స్ ఉండడంతోనే టైగర్ ష్రాఫ్ ఇలా చేశాడని అంటుండగా.. ఇంకొందరు చెడ్డీ ప్రీమియర్ లీగ్, చెడ్డీ బ్యాట్స్ మ్యాన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

 

Updated Date - Jun 12 , 2025 | 07:36 PM