సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maa Inti Bangaram: ఫైనల్‌గా నందినీరెడ్డితోనే షూరు అయింది..

ABN, Publish Date - Oct 27 , 2025 | 07:02 PM

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత నటిగానే కాకుండా నిర్మాతగానూ బిజీ అవుతున్నారు. సొంతగా ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ను ప్రారంభించిన ఆమె  ప్రొడక్షన్‌ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను ప్రకటించి చాలా కాలమైంది.

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత (Samanatha) నటిగానే కాకుండా నిర్మాతగానూ బిజీ అవుతున్నారు. సొంతగా ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ను ప్రారంభించిన ఆమె  ప్రొడక్షన్‌ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను (Maa Inti Bangaram) ప్రకటించి చాలా కాలమైంది. ఈ మధ్యలో ఇదే బ్యానర్‌లో ‘శుభం’ సినిమా తీసి హిట్‌ అందుకున్నారు. అయితే ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించి చాలాకాలమే అయినా దానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. సడెన్‌గా పూజా కార్యక్రమాలతో సోమవారం షూటింగ్‌ మొదలైనట్లు సమంత తెలిపారు. ఈ చిత్రంలో  సమంత, దిగంత్‌, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్‌ నటి గౌతమి, మంజుల కీలక పాత్రధారులు.

ఈ చిత్రానికి సమంత, రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌ దువ్వూరు నిర్మాతలు. ‘ఓ బేబి’ చిత్రంత తర్వాత సమంత, నందినీ రెడ్డి (Nandini Reddy) కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ‘సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక, ఆశీర్వాదాలతో  ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రారంభమైంది’ అని సమంత తెలిపారు. అద్భుతమైన యాక్షన్‌ బ్యాంగ్‌తో ప్రేక్షకులముందుకు వస్తామని మేకర్స్‌ తెలియజేశారు. ఈ చిత్రానికి ఓం ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మీనన్‌. వసంత్‌ మరిన్‌గంటి కథ, స్క్రీన్ ప్లే  అందించారు.

Updated Date - Oct 27 , 2025 | 07:19 PM