Samantha: జిగిరి దోస్త్ తో సామ్.. ఎవరో తెలుసా..?

ABN , Publish Date - Jun 29 , 2025 | 09:23 PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.

Samantha

Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. నిత్యం ఏవో ఫోటోస్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. నిన్నటికి నిన్న.. ఫుల్ అప్స్ చేయకపోతే కామెంట్స్ చేయకూడదు అని డీల్ కుదుర్చుకున్న సామ్.. తాజాగా తన లైఫ్ లో రోజువారీ రొటీన్ ను అభిమనులతో పంచుకుంది. ఇక అందులో ఆమె తన జిగిరీ దోస్త్ తో కనిపించింది.


సమంతకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అయితే ప్రతిసారి కలిసే ఫ్రెండ్స్ చాలా తక్కువమంది ఉన్నారు. అందులో కీర్తి సురేష్ ఒకరు. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ, పబ్, బీచ్, వెకేషన్ ఇలా ఏదైనా సరే ఎప్పుడు వీరు కలిసే కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించిన విషయం తెల్సిందే. సావిత్రిగా కీర్తి కనిపిస్తే.. ఆమె కథను ప్రపంచానికి తెలిపే జర్నలిస్ట్ మధురవాణిగా సమంత కనిపించింది. అప్పటినుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇప్పటివరకు స్నేహంగా కొనసాగుతూ వస్తుంది.


తాజాగా ఈ దోస్తులు ఇద్దరూ లంచ్ కు కలిసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోను షేర్ సమంత.. 'లంచ్ కు మధ్యాహ్నం కూర్చుంటే లేచేసరికీ సాయంత్రం అవుతుంది' అంటూ రాసుకొచ్చింది. అంటే ఈ స్నేహితులు ఇద్దరూ ఒకచోట కలిస్తే అంతా రచ్చ ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇద్దరు ముద్దుగుమ్మలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. టూ క్యూటీస్ ఇన్ సింగిల్ ఫ్రేమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఇద్దరి కెరీర్ ల గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం సామ్.. రక్త బ్రహ్మాండ సిరీస్ తో బిజీగా ఉండగా.. కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఉప్పు కప్పురంబు రిలీజ్ కు రెడీ అవుతుండగా.. రివాల్వర్ రీటా షూటింగ్ జరుపుకుంటుంది.

Aamir Khan: భార్యతో విడాకులు.. ఆత్మహత్యకు ప్రయత్నించా

Updated Date - Jun 29 , 2025 | 09:24 PM