Aamir Khan: భార్యతో విడాకులు.. ఆత్మహత్యకు ప్రయత్నించా

ABN , Publish Date - Jun 29 , 2025 | 08:19 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Aamir Khan

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒక్క సినిమా తీయకపోయినా కూడా తెలుగు ప్రేక్షకులకు ఆయన సినిమాలు అంటే మక్కువ ఎక్కువే అని చెప్పొచ్చు. ప్రొఫెషనల్ గా సక్సెస్ ను అందుకున్న ఆమీర్ పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాడు. అమీర్.. ఇప్పటికీ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అతని మొదటి భార్య రీనా దత్తా. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెతో కలకాలం బతకలనుకున్నాడు. కొన్ని విభేదాల వలన వారు విడిపోవాల్సి వచ్చింది.


అయితే రీనా వదిలి వెళ్ళాక ఆ బాధను తట్టుకోలేక అమీర్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. తాజాగా ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'రీనాతో విడిపోయినప్పుడు నేను చాలా క్రుంగిపోయాను. ఆరోజు సాయంత్రమే ఫుల్ బాటిల్ తాగేసాను. అప్పటి నుంచి దాదాపు ఒక ఏడాది మొత్తం తాగుతూనే ఉన్నాను. నిద్ర ఉండేది కాదు. ఎక్కువగా తాగడం వలన స్పృహ కోల్పోయేవాడిని. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా కలిసేవాడిని కాదు. ఎక్కడకు వెళ్ళేవాడిని కాదు. అప్పుడే లగాన్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.


ఇక ఆ సినిమా తరువాత నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా పిలిచేవారు. అది విన్నప్పుడు చాలా వ్యంగ్యంగా అనిపించేది. ఇక ఆ సమయంలోనే నాకు సల్మాన్ ఖాన్ దగ్గరయ్యాడు. అప్పటికే మేము అందాజ్ అప్నా అప్నా సినిమా చేశాం. షూటింగ్ సమయంలో మేము ఎక్కువ మాట్లాడుకొనేవాళ్ళం కాదు. సల్మాన్ ఎప్పుడు టైమ్ కి వచ్చేవాడు కాదు. ఇక రీనాతో విడాకుల తరువాత సల్మాన్ నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చాడు. నాతోపాటు కూర్చొని కొంత సమయాన్ని గడిపాడు. అప్పుడు ఇద్దరం ఎన్నో మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం ఏర్పడింది' అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే రీనా - అమీర్ లకు ఇద్దరు పిల్లలు. జునైద్ ఖాన్, ఐరా ఖాన్. జునైద్ హీరోగా కొనసాగుతుండగా ఐరా పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

Raghava Lawrence: నిన్ను ఒక్కసారి కలవాలి.. నా దగ్గరకు రా

Updated Date - Jun 29 , 2025 | 08:19 PM