Samantha: పండగ పూట.. శుభవార్త చెప్పిన సమంత
ABN, Publish Date - Oct 03 , 2025 | 04:18 PM
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) పండగపూట అభిమానులకు ఒక శుభవార్త చెప్పుకొచ్చింది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) పండగపూట అభిమానులకు ఒక శుభవార్త చెప్పుకొచ్చింది. దసరా రోజున సామ్ కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. తన కొత్తింటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కొత్త ప్రయాణం అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఇక ఇంటి బయట సామ్ అని ఇంగ్లిష్ లెటర్స్ రాసి ఉన్నాయి. దీంతో ఈ ఇల్లు కేవలం సామ్ కు మాత్రమే సొంతం అని అర్ధమవుతుంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్ లోనా.. ముంబైలోనా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తరువాత హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లిన సామ్ అక్కడే సెటిల్ అయ్యింది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సామ్.. అతనితోనే కలిసి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముంబై లో సామ్ కి సొంత ఇల్లు లేకపోవడంతో అక్కడే ఆమె ఇల్లు తీసుకొని ఉంటుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ఇంటిలో ఆమె ఒంటరిగా ఉంటుందా.. లేక జంటగా ఉంటుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.
సామ్ కెరీర్ విషయానికొస్తే.. శాకుంతలం తరువాత ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు. మధ్యలో సిటాడెల్ హానీ బన్నీ లాంటి సిరీస్ తో వచ్చినా అదేమీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత సామ్.. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అందులో శుభం అనే సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించి ఏడాది దాటింది. ఇప్పటికీ ఆ సినిమా సంగతి ఏంటి అనేది తెలియదు. మరి కెరీర్ కు ప్లస్ అయ్యేలా సామ్ ఏం చేస్తుంది అనేది చూడాలి.
Tollywood: 'జార్జిరెడ్డి' దర్శకుడితో సాగర్ పాన్ ఇండియా మూవీ
Tollywood: మరో సినీ రచయిత మృతి...