Samantha: ప్రపంచం వారి నాయకత్వాన్నే కోరుకుంటుంది
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:13 PM
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. హీరోయిన్ గా కాకుండా నిర్మాతగామారి వరుస సినిమాలను నిర్మిస్తుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. హీరోయిన్ గా కాకుండా నిర్మాతగామారి వరుస సినిమాలను నిర్మిస్తుంది. ఇక హీరోయిన్ గా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సామ్ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మా ఇంటి బంగారం. రెండు రక్త బ్రహ్మాండ్. సామ్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ను ఎప్పుడు ఫినిష్ చేస్తుందో ఆమెకే తెలియాలి.
సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో సామ్ నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తన మనసులోని అభిప్రాయాలను చెప్పడానికి ఏరోజు కూడా సంకోచించదు. ముఖ్యంగా తన నటన, తనకు సపోర్ట్ గా నిలిచినవారి గురించి నిత్యం మాట్లాడుతూనే ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో మహిళలు రిస్క్ తీసుకోవాలని సామ్ తెలిపింది.
ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా సామ్ మాట్లాడుతూ.. ' నా 15 ఏళ్ల కెరీర్ లో నేను చాలా నేర్చుకున్నాను. హీరోయిన్స్ కు చాలా తక్కువ సమయం దొరుకుతుందని నేను అనుకుంటాను. వారికి వచ్చే పేరు, ప్రతిష్ట, గుర్తింపు ఇవన్నీ ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ, అవే శాశ్వతం కాదు. ఇవన్నీ ఉన్నప్పుడే నలుగురిలో అయినా స్ఫూర్తి నింపాలి. అలా చేయాలనీ వారిలో వారే అనుకోవాలి. ఆ ప్రోత్సహం ఎంతో శక్తిని ఇస్తుంది. నన్ను అలా ప్రోత్సహించడానికి నా చుట్టూ చాలామంది ఉన్నారు. అది నాకు ఎంతో ఆనందంగా ఉంది.
మహిళలు ఇప్పుడు రిస్క్ చేస్తేనే విజయాలను అందుకుంటున్నారు. వారే దైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నారు.. సక్సెస్ అవుతున్నారు. ఈ విషయాన్నీ నేను కచ్చితంగా చెప్తున్నాను. మనల్ని మనం నమ్మితేనే ముందుకు వెళ్ళగలం. ముందుచూపు ఉన్న ప్రతి మహిళ.. తన ఆలోచనలను అందరితో పంచుకోవాలి. ప్రపంచం వారి నాయకత్వాన్ని కోరుకుంటుంది' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Kapil Sharma Show: కపిల్ శర్మ షోలో జగపతి కామెంట్స్..
Mirai: ‘మిరాయ్’ మొదట అనుకున్న హీరో ఎవరంటే..