Mirai: ‘మిరాయ్‌’ మొదట అనుకున్న హీరో ఎవరంటే..

ABN , Publish Date - Sep 12 , 2025 | 06:25 PM

‘హనుమాన్‌’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత తేజ సజ్జ నటించిన ‘మిరాయ్‌’ శుక్రవారం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం విజువల్‌ వండర్‌గా పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది.


‘హనుమాన్‌’ (Hanuman) బ్లాక్‌బస్టర్‌ తర్వాత తేజ సజ్జ (Teja Sajja) నటించిన ‘మిరాయ్‌’ (Mirai) శుక్రవారం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం విజువల్‌ వండర్‌గా పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది.  అయితే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సినిమాకు హీరోగా మొదటి ఎంపిక తేజా కాదు. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని మూడేళ్ల కిందట రాసుకున్న కథను ముందుగా నాని అంగీకరించినా, రెమ్యూనరేషన్‌ వంటి కారణాలతో ఆయన తప్పుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత ‘హనుమాన్‌’ విజయంతో తేజా సజ్జతో ఈ కథ పట్టాలెక్కింది. ఈ మధ్యన వచ్చిన చాలా చిత్రాలు గ్రాఫిక్స్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాయి. గ్రాఫిక్స్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రం కోసం మేకర్స్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తక్కువ బడ్జెట్‌లోనే బెస్ట్‌ అవుట్‌పుట్‌ తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు ‘మిరాయ్‌’ సాధించిన సక్సెస్‌తో తేజ  బంపరాఫర్‌ కొట్టాడని, అతడి స్టోరీ సెలక్షన్స్‌ అద్భుతమని ప్రేక్షకులు ప్రశంసలు అందిస్తున్నారు. ఇలాంటి కథని నానిలాంటి స్టార్‌ మిస్‌ చేసుకున్నాడని టాక్‌ నడుస్తోంది.

ఈ కథను కార్తిక్‌ చాలా కాలం క్రితమే రాసుకున్నాడు. సినిమాటోగ్రాఫర్‌ ఉన్న అతడు ఈ కథని చాలామందికి వినిపించగా అతడి దర్శకత్వంలో నటించేందుకు చాలామంది హీరోలు వెనుకాడారు. ఈ కథ విని ఇంప్రెస్‌ అయిన నాని గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కార్తీక్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సినిమా సెట్స్‌ మీదికి వెళ్లే సమయంలో రెమ్యునరేషన్‌ విషయంలో తేడాలు రావడంతో నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.  సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే కార్తీక్‌ తన కథకి సూటయ్యే హీరో కోసం ఎదురుచూశాడు. అలా తేజా దొరికాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఒకటి రెండు సార్లు విడుదల వాయిదా పడినా.. ఫైనల్‌గా శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పోరాట సన్నివేశాల్లో తేజ సజ్జా, మంచు మనోజ్‌ ఒకరికి ఒకరు పోటీపడి నటించారనీ, నేపథ్య సంగితం సన్నివేశాలకు తగినట్లుగా ఉందని,  విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్బుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఫైనల్‌గా తేజాకు మరో హిట్‌ అందింది. చాలాకాలంగా సక్సెస్‌, హిట్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి ఎట్టకేలకు హిట్‌ పడింది. 

Updated Date - Sep 12 , 2025 | 06:25 PM