Samantha: మరో టాటూను తొలగించిన సమంత !
ABN, Publish Date - Jun 07 , 2025 | 03:10 PM
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది. ఇందులో మొదటి సినిమాగా శుభం(Shubham) అనే సినిమా నిర్మించింది. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన శుభం మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమా హిట్ అవ్వడంతో సామ్.. మరిన్ని కథలను వింటున్నదని టాక్ నడుస్తోంది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా ఒక పోస్ట్ ను అభిమానులతో పంచుకుంది. నథింగ్ టూ హైడ్.. అంటే దాచడానికి ఏమి లేదు అనే క్యాప్షన్ తో సామ్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. రెడ్ కలర్ బ్యాక్ లెస్ డిజైనర్ డ్రెస్ లో సామ్ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో నెటిజన్స్ ఒక విషయాన్నీ గమనించారు. సమంత వెనుక మెడ కింద భాగంలో ఉండే టాటూను ఆమె తొలగించినట్లు తెలుస్తోంది.
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తరువాత సామ్ మూడు టాటూస్ ను వేయించుకుంది. చై - సామ్ కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే వారికి చాలా ప్రత్యేకం. ఆ సినిమా వలనే కలిశామని ఎంతో ప్రేమతో సామ్.. తన వీపు మీద YMC అనే అక్షరాలను టాటూగా వేయించుకుంది. పెళ్లి తరువాత చై - సామ్ ఇద్దరూ కలిసి చేతిపై ఒకేలాంటి టాటూ వేయించుకున్నారు. ఇక ఈ రెండు కాకుండా చై మీద ప్రేమతో నడుము పై భాగంలో చై పేరును టాటూ వేయించుకుంది. ఇక సామ్, చై తో విడిపోయాకా.. రెండు టాటూలను తొలగించింది. ఇప్పుడు YMC టాటూను కూడా సామ్ తొలగించిందని తెలుస్తోంది. గతం తాలూకు అన్ని జ్ఞాపకాలను సామ్ చెరిపేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.