సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: రాజ్‌తో.. స‌మంత చెట్టాప‌ట్టాల్! రూమ‌ర్స్ నిజ‌మేనా

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:54 PM

స‌మంత, డైరెక్ట‌ర్‌ రాజ్‌నిడిమోరు మ‌ధ్య వ్యవ‌హారంపై రోజురోజుకు ఊహాగానాలు అధిక‌మ‌వుతూ ఉన్నాయి త‌ప్ప ఎక్క‌డా త‌గ్గడం లేదు

సౌత్ టాప్ హీరోయిన్ స‌మంత (Samantha), ద‌ర్శ‌క నిర్మాత ఫ్యామిలీ మెన్ సిరీస్ ఫేమ్‌ రాజ్‌నిడిమోరు (Raj Nidimoru) మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా న‌డుస్తున్న వ్యవ‌హారంపై రోజురోజుకు ఊహాగానాలు అధిక‌మ‌వుతూ ఉన్నాయి త‌ప్ప ఎక్క‌డా త‌గ్గిన‌ట్లు అనిపించ‌డం లేదు. అదేవిధంగా వారిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న సైతం అలాగే ఉంటోంది.. ఇంత‌వ‌ర‌కు త‌మ‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై వారిరువురు రెస్సాండ్ అవ‌క‌పోవ‌డం ఈ వార్త‌ల‌కు మ‌రింత‌గా బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.

తాజాగా.. అమెరికా తానా సమావేశంలో జంట‌గా సంద‌డి చేసి మీడియాకు ప‌ని పెట్టిన వీరు మ‌రోసారి మంగ‌ళ‌వారం డెట్రాయిట్ వీధుల్లో మ‌రింత చ‌నువుగా క‌లిసి క‌లియ‌ తిరిగారు. ఇందుకు సంబంధించిన‌ ఫోటోల‌ను స‌మంత‌ ఇన్‌స్టాలో చేయ‌డంతో ఇప్పుడు వీరి మ‌ధ్య ఉన్న సంబంధం విష‌యంలో వ‌స్తున్న వార్త‌లు నిజ‌మే అని క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా ఉన్నాయి. ఇద్దరూ కలిసి చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ముఖ్యంగా డెట్రాయిట్‌లో వారిద్దరూ కలిసి విందులో పాల్గొన్న సందర్భంలో, రాజ్ సమంత భుజం చుట్టూ చేయి వేసిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అయితే.. అంత‌టితో ఆగ‌క వీరిద్దరూ కొన్ని ప్రముఖ ఈవెంట్లలో కలిసి పాల్గొనడం, రెస్టారెంట్‌ పార్టీల్లో కనిపించడం, ఫోటోల కోసం కలిసి పోజులివ్వడం కూడా చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది అధికారికమేనా? అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే, స‌మంత‌ను ఇలా హ్యాపీగా చూడటం చాలా బాగుంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్ద‌రి సంబంధం వారిపై వ‌స్తున్న రూమ‌ర్స్‌కు ఆజ్యం పోసేలా ఉన్నాయ‌ని అంటూ all these have only added fuel to the gossip fire పోస్టులు సైతం పెడుతున్నారు.

మ‌రి ఈ సంబంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో, ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలాఉంటే స‌మంత ఇప్ప‌టికే రాజ్ డైరెక్ష‌న్‌లో ఫ్యామిలీ మ్యాన్‌ 2 (The Family Man Season 2) , సీజ‌న్‌ 3ల‌తో పాటు, ఆ మ‌ధ్య వ‌చ్చిన సిటాడెల్ హ‌నీ బ‌న్నీ (Citadel: Honey Bunny) వంటి సిరీస్‌ల‌లో న‌టించింది. త్వ‌ర‌లో రానున్న‌ ర‌క్త్‌ బ్ర‌హ్మండ్ (Rakt Brahmand: The Bloody Kingdom) వెబ్ సిరీస్‌లోనూ స‌మంత న‌టిస్తోంది.

Updated Date - Jul 09 , 2025 | 03:26 PM