సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: హేటర్స్ తో డీల్ కుదుర్చుకున్న సమంత..

ABN, Publish Date - Jun 28 , 2025 | 07:58 PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం ఒకపక్క సినిమాలు ఇంకోపక్క నిర్మాణరంగంలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

Samantha

Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం ఒకపక్క సినిమాలు ఇంకోపక్క నిర్మాణరంగంలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్య ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తున్న సామ్.. మొదటి నుంచి ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న విషయం తెల్సిందే. అన్నం లేకుండా అయినా ఉంటుందేమో కానీ, వర్క్ అవుట్స్ లేకపోతే సామ్ అస్సలు ఉండలేదు. ఈ విషయాన్నీ ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఇక నాగచైతన్య (Akkineni Ngachaitanya) తో విడాకుల తరువాత సామ్ మయోసైటిస్ బారిన పడిన విషయం తెల్సిందే. ఇక ఈ వ్యాధి బారినపడిన దగ్గరనుంచి సామ్ లో చాలా మార్పులు వచ్చాయి.


చాలా బరువు తగ్గింది. ముఖంలో కళ లేదు. ఆరోగ్యం బాగోలేదు. స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకోవడంతో బాగా బక్కచిక్కి అందం లేకుండా పోతుందని సామ్ ను ట్రోల్ చేస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా సామ్.. తన హేటర్స్ తో ఒక డీల్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో తాను ఫుల్ అప్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ .. ' డీల్ కుదుర్చుకుందాం.. మీరు మొదట వీటిలో 3 చేసేవరకు నన్ను సన్నగా ఉన్నావు, అనారోగ్యంగా ఉన్నావ్ లాంటి చెత్త కామెంట్స్ చేయొద్దు. ఫుల్ అప్స్ కనుక చేయలేకపోతే ఆ విధంగా మాట్లాడకండి' అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఫుల్ అప్స్ చేసి కామెంట్స్ చేస్తే ఓకేనా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ సిరీస్ తో ఆమె బిజీగా మారింది. ఇంకోపక్క రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే లలో ఒకరైన రాజ్ ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 3 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ జంట భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.

Updated Date - Jun 28 , 2025 | 07:58 PM