సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: సమంత చీర కొంగు లాగేసారు.. సామ్ రియాక్షన్ 

ABN, Publish Date - Dec 22 , 2025 | 08:09 AM

ఇటీవల కూకట్ పల్లి, లూలూ షాపింగ్ మాల్ లో జరిగిన 'ది రాజాసాబ్' సాంగ్ లాంచ్ అనంతరం కార్ ఎక్కే సమయంలో అభిమానులు చేసిన హంగామా  నిధి అగర్వాల్ (nidhhi agarwal) కు ఆగ్రహం తెప్పించింది.

Samantha

ఇటీవల కూకట్ పల్లి, లూలూ షాపింగ్ మాల్ లో జరిగిన 'ది రాజాసాబ్' సాంగ్ లాంచ్ అనంతరం కార్ ఎక్కే సమయంలో అభిమానులు చేసిన హంగామా  నిధి అగర్వాల్ (nidhhi agarwal) కు ఆగ్రహం తెప్పించింది. అధిక జనాభాలో చిక్కుకుపోయిన ఆమె పట్ల ఆకతాయిలు మిస్ బెహేవ్ చేసారు,. తన సిబ్బంది సాయంతో నిధి ఏదోలా కార్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆదివారం ఇలాంటి సిట్యుయేషన్ సమంతకు (Samantha)ఎదురైంది.

జూబ్లీహిల్స్ లోని ఓ షోరూం ప్రారంభానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి తర్వాత తెలంగాణలో ఆమె హాజరైన  మొదటి ప్రోగ్రామ్ ఇదే.  షోరూం ప్రారంభం పూర్తయాక  తిరిగి వస్తున్నప్పుడు సమంతను జనాలు చుట్టుముట్టారు. దాంతో ఆమె చాలా కష్టపడి తన కారు వద్దకు చేరుకున్నారు.  అధిక జనాభా ఉండటంతో  జనాలు అదుపు తప్పిపోయి ఆమెపై పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ గందరగోళ పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు సమంత చీర కొంగును లాగబడినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. తొక్కిసలాటలో కొందరు కింద పడ్డారు కూడా. అయితే సమంత ఎంతో ఓర్పుగా ఈ జనాలా నుంచి బయటపడి కార్ ఎక్కింది.  ఈ వైరల్ వీడియో చూసి అభిమానులు స్పందించారు.  'ఈ జనాలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?' అని  ఒక అభిమాని  రాశారు. మరొకరు 'వీళ్ళు జంతువుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?' అని అడిగారు. ఇంకొకరు 'వీళ్ళతో సమస్య ఏంటి?' అని ప్రశ్నించారు.

ఇటీవల రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సామ్ సినిమాలపై దృష్టిపెట్టారు. తన సొంత బ్యానర్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో 'మా ఇంటి బంగారం' సినిమాలో నటిస్తున్నారు సమంత. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 

Updated Date - Dec 22 , 2025 | 09:48 AM