సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Champion Second Song: సల్లంగుండాలే.. గుండెకు హత్తుకునేలా ఎంత మధురంగా ఉంది

ABN, Publish Date - Dec 09 , 2025 | 05:57 PM

రోషన్ మేక (Roshan Meka), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛాంపియన్ (Champion).

Champion Second Song

Champion Second Song: రోషన్ మేక (Roshan Meka), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛాంపియన్ (Champion). స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ప్రియాంక దత్, జికె మోహన్, జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే రిలీజైన గిరా గిరా సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న ఛాంపియన్ రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. సల్లంగుండాలే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పల్లెటూరు.. ఆ ఊరినే తల్లిగా భావించే మనుషులు.. ఎన్ని కష్టాలు వచ్చినా మట్టిని వదలని గ్రామస్తులు.. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఊరంతా చుట్టాలే అని ఈ పాటలో చూపించారు.

వివాహానికి ముందు పెళ్లి కూతురు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు మరియు గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. ఆమె తండ్రి ఆమెను ఓదార్చడానికి రావడంతో పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉండాలని తల్లిదండ్రులు., మొత్తం కుటుంబం - చివరికి మొత్తం గ్రామం ఆ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించడం చూపించారు. మెలోడీ అంటే మిక్కీ జె మేయర్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సాంగ్ కూడా గుండెకు హత్తుకునేలా ఉంది. ఇక రితేష్ జి రావు, మనీషా ఈరబత్తి వాయిస్ మెస్మరైజ్ చేస్తే.. బృంద స్టెప్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. రోషన్, అనస్వర జంట చూడచక్కగా అనిపిస్తుంది. మొత్తానికి రెండో పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 09 , 2025 | 06:09 PM