Sai Durga Tej: అల్లు అర్జున్.. ఇప్పుడు గొప్పోడు అయిపోయాడు

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:11 PM

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) కు రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెల్సిందే.

Sai Durga Tej

Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) కు రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెల్సిందే. హెల్మెట్ ఉండడం వలనే తేజ్ బ్రతికి బయటపడ్డాడు. దీంతో అప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకోవడం ప్రాణాలను కాపాడుతుందని ప్రజల్లో అవగాహనా పెంచుతూ వస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో 2025 లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.


ఇక ఒక అభిమాని అల్లు అర్జున్ గురించి ప్రశ్నించగా.. తేజ్ కొద్దిగా ఇబ్బందిగానే సమాధానం చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోల్లో ఒకరిగాఅయిపోయారు ఇప్పుడు.. చాలా గొప్పోళ్ళు అయిపోయారు ఇప్పుడు' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి బన్నీ ఫ్యాన్స్.. తేజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బన్నీ అంటేనే తేజ్ కు నచ్చదు అని, మెగా హీరోల వెంటనే ఉంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


జనసేనకు కాకుండా అల్లు అర్జున్.. తన ఫ్రెండ్ కు సపోర్ట్ చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. మెగా - అల్లు కుటుంబాల మధ్య అగాధం ఏర్పడింది. బన్నీ చేసిన ఆ ఒక్క పని ఎంతో నెగిటివిటీని తీసుకొచ్చి పెట్టింది. అయినా కూడా బన్నీ తగ్గకుండా నిలబడ్డాడు. ఫ్రెండ్ కోసం తానెప్పుడూ అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం బన్నీకి విరుద్ధంగా మారారు. ముఖ్యంగా తేజ్.. సోషల్ మీడియాల నుంచి బన్నీని తొలగించాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని టాక్. ఇక చాలా గ్యాప్ తరువాత బన్నీ గురించి తేజ్ మాట్లాడేసరికి మరోసారి ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rithu Varma: రీతూవర్మ చేతులమీదుగా అజోర్ట్‌ స్టోర్‌ ప్రారంభం..

స్కూల్ నేపథ్యం.. అన్ని అంశాలతో.. 'స్కూల్ లైఫ్'

Updated Date - Oct 11 , 2025 | 10:11 PM