స్కూల్ నేపథ్యం.. అన్ని అంశాలతో.. 'స్కూల్ లైఫ్'

ABN , Publish Date - Oct 11 , 2025 | 09:37 PM

పులివెందుల మహేష్ హీరోగా నటించి దర్శకత్వం  వహించిన చిత్రం 'స్కూల్ లైఫ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  బాలల దినోత్సవం  సందర్భంగా నవంబర్ 14న విడుదల కానుంది. 

పులివెందుల మహేష్ (Mahesh) హీరోగా నటించి దర్శకత్వం  వహించిన చిత్రం 'స్కూల్ లైఫ్' (School life) . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  బాలల దినోత్సవం  సందర్భంగా నవంబర్ 14న విడుదల కానుంది. నైనిషా క్రియేషన్స్ బ్యానర్లో గంగాభవని నిర్మించారు.  సావిత్రి, షన్ను, సీనియర్ నటులు సుమన్, ఆమని, మరియు మురళి గౌడ్ ముఖ్య పాత్రల్లో నటించారు.


ఈ సందర్భంగా పులివెందుల మహేష్ మాట్లాడుతూ  'స్కూల్ లైఫ్' కేవలం నా ఒక్కడి కల కాదు, మా టీమ్ సభ్యులందరూ కలిసి కష్టపడి తీసిన చిత్రం. రాయలసీమ నేటివిటీకి పెద్దపీట వేస్తూ, ఒక స్కూల్ నేపథ్యంలోని చక్కటి ప్రేమ కథ, రైతుల కష్టాలు, స్నేహం, మరియు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను  పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో రూపొందించాం. ఇటీవల విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సుమన్ గారు, ఆమని గారు, మురళి గారు వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక సినీ ప్రేమికుడిగా, ఒక ఆడియన్ ఎలా ఇష్టపడతారో అలానే ఈ సినిమాను తీర్చిదిద్దాను' అని అన్నారు. 
  

Updated Date - Oct 11 , 2025 | 09:37 PM