Sai Durga Tej: పులితో మెగా మేనల్లుడు పోరాటం..
ABN, Publish Date - Dec 03 , 2025 | 07:10 PM
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు(Sambarala Yeti Gattu) సినిమాతో బిజీగా ఉన్నాడు.
Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు(Sambarala Yeti Gattu) సినిమాతో బిజీగా ఉన్నాడు. విరూపాక్ష తరువాత తేజ్ నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం అన్నీ ఆశలు తేజ్ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక దీని తరువాత తేజ్ ఎలాంటి సినిమా చేస్తాడో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం కామెడీతో కూడిన యాక్షన్ సినిమా చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. సేవ్ ది టైగర్స్ అనే సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ తేజా కాకమాను. ఓటీటీలో ఈ సిరీస్ రెండు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ సిరీస్ తరువాత తేజా.. తేజ్ కోసం ఒక మంచి కథను రెడీ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ మధ్యనే తేజ్ ని తేజా కలిసి కథను వినిపించాడని, అది బాగా నచ్చడంతో మెగా మేనల్లుడు ఓకే చెప్పినట్లు సమాచారం.
సేవ్ ది టైగర్స్ లో ఉన్నట్లే ఈ సినిమాలో కామెడీ కూడా బాగా ఉంటుందని, ఇక ఈ కథలో మరో హీరోగా పులి కనిపిస్తుందని అంటున్నారు. అంటే తేజ్ ది ఎంత ముఖ్యమైన రోల్ నో.. పులిది కూడా అంతే ఉంటుందని టాక్. ఇక తేజ్ కి పులికి మధ్య పోరాట సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయని, క్లైమాక్స్ లో అయితే అందరూ షాక్ అవుతారని అంటున్నారు. ఏదిఏమైనా తేజ్ మాత్రం మంచి కథను ఎంచుకున్నాడని.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుందట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.