Sahakutumbanam: కొత్త సంవత్సరం తొలి రోజున 'సఃకుటుంబానాం'
ABN, Publish Date - Dec 29 , 2025 | 05:39 PM
రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన సినిమా 'సఃకుటుంబానాం'. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
డిసెంబర్ 12న రావాల్సిన 'సఃకుటుంబానాం' చిత్రం కూడా 'అఖండ 2' సినిమా కారణంగా విడుదల కాకుండా పోయింది. అయితే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి1న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన సినిమా ఇది. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించారు. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, 'శుభలేఖ' సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలక పాత్రలు చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు.
ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ, 'కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మా సినిమా అనివార్య కారణాల విడుదల కాలేదు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా 2026 జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 సంవత్సరంలో అందరి జీవితాలు మరింత వెలుగు పొందాలని ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ 'సఃకుటుంబానాం'ను విడుదల చేయబోతున్నాం' అని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: Actor Nandu: నాపై తప్పుడు ప్రచారం
Also Read: Peddi: పెద్దిలో అప్పలసూరిగా స్టార్ నటుడు.. గుర్తుపట్టారా ఎవరో