Kannappa: కన్నప్ప టికెట్ రేట్ల పెంపు.. 10 రోజులు
ABN, Publish Date - Jun 25 , 2025 | 08:57 PM
కన్నప్ప ఈ మూవీ టీంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
అనేక అవాంతరాలను దాటుకుని మంచు విష్ణు (Vishnu Manchu) కన్నప్ప (Kannappa) సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ సైతం బుధవారం ప్రారంభమయ్యాయి. అయితే ఈ మూవీ టీంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కన్నప్ప సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. దీంతో మల్టీప్లెక్స్ మరియు సింగిల్ స్క్రీన్స్ లో రూ.50 వరకు పెరగనున్నాయి. పది రోజుల పాటు పెరిగిన రేట్లు చలామణిలో ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. హయ్యర్ క్లాస్ టికెట్లకు మాత్రమే ఈ రేట్ల పెంపు వర్తించనుంది. కింది క్లాస్ టికెట్ రేట్లు యధాతదంగానే ఉండనున్నాయి. దీంతో ఈ టికెట్ రేట్ల పెంపు అనంతరం సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర ₹206.50, మల్టీప్లెక్స్‌లలో ₹236 కానున్నాయి. ఈ రేట్ల పెరుగుదల వళ్ల కన్నప్ప మేకర్స్‌కు చాలా ఉపశమనం లభించనుంది. కాగా తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్ కు మంచు విష్ణు (Vishnu Manchu) దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం స్పందించి రేట్ల పెంపుకు అనుమతినిస్తూ జీవో ఇచ్చింది.