Rukmini Vasanth: అనుమానాలు పటాపంచలు.. మంచి ఆప్షన్ అయింది..
ABN, Publish Date - Oct 05 , 2025 | 07:55 PM
‘సప్త సాగరాలు దాటి’, ‘అప్పుడు ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. తాజాగా ‘కాంతార చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘సప్త సాగరాలు దాటి’, ‘అప్పుడు ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) తాజాగా ‘కాంతార చాప్టర్ 1’తో (kantara 2) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలోని రిషబ్ శెట్టి నటన గురించి, పతాక సన్నివేశాల గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎక్కువగా చర్చ జరిగింది మాత్రం హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించే. నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ చిత్రంలో కథానాయికగా రుక్మిణి వసంతన్‌కు మంచి మార్కులే పడ్డాయి. తన క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా తన స్ర్కీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఇప్పుడు రుక్మిణి వసంతన్ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అందుకు కారణం ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంతో రుక్మిణి హీరోయిన్ కాబట్టి. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో రుక్మిణి వసంతన్ ప్రతిభ చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో ఆమెను కథానాయికగా సెలెక్ట్ సంగతి తెలిసిందే. అయితే ‘సప్తసాగరాలు’ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. కమర్షియల్ హీరోగా మంచి పేరున్న ఎన్టీఆర్ పక్కన రుక్మిణి సరిపోతుందా అన్న అనుమానాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’తో అవన్నీ పటాపంచలు అయిపోయాయి. ఎన్టీఆర్‌తో సరసన రుక్మిణి పర్ఫెక్ట్ హీరోయిన్ అని అభిమానులు కితాబిస్తున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండుతుందని నమ్ముతున్నారు.
రుక్మిణి కూడా 'కాంతార చాప్టర్ 1' విషయంలో తెలివిగా వ్యవహరించి అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంతో ఆమెది ఇంపార్టెంట్ రోల్. ఈ సినిమా సక్సెస్ అయితే కమర్షియల్ సినిమాల వైపు వెళ్లొచ్చనే, మంచి ఆఫర్లు వస్తాయని ముందే ఊహించినట్లు ఉంది. అందుకే ఈ సినిమాకు చాలా కష్టపడింది. అది తెరపై కనిపిస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని ఆఫర్లు పక్కన పెట్టింది. ఇవన్నీ కూడా ఆమెకు కలిసొచ్చాయి. డ్రాగన్ కాకుండా మరో పక్క యశ్‌తో టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. కాంతాకా 2 సక్సెస్‌తో తెలుగులో కూడా మంచి ఆప్షన్‌గా మారింది.