సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rukmini Vasanth: మా రుక్మిణిని.. త‌క్కువ చేసి మాట్లాడొద్దు! అభిమానుల ఆగ్రహం

ABN, Publish Date - Sep 30 , 2025 | 05:59 PM

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవి శంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారాయి. ఎన్టీఆర్‌ని పొగడటానికి రుక్మిణి వసంత్‌ను తగ్గించి మాట్లాడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rukmini

హోంబులే ఫిలింస్‌ కాంతారా లెజండ్ చాఫ్ట‌ర్ 1 (Kantara Chapter 1) చిత్రాన్ని ఏ ముహూర్తానా ప్రారంభించారో గానీ అడుగ‌డుగునా ఆటంకాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. చివ‌ర‌కు రెండు రోజుల్లో మూవీ రిలీజ్ అన‌గా కూడా కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉన్నాయి. నిన్న‌టి వ‌ర‌కు బాయ్‌కాట్ కాంతారా స్లోగ‌న్‌తో రెండు తెలుగు రాష్ట్రాల సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగానే వైర‌ల్ అవ‌గా తాజాగా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఆ వ్యవ‌హారం కాస్త సద్దుమ‌ణిగింది.

అచయితే.. ఇప్పుడా విష‌యం మ‌రిచేలోగా తాజాగా మ‌రో కొత్త అంశంపై తెర మీద‌కు వ‌చ్చి ఇప్పుడు సామాజిక మాద్య‌మాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతుంది. వివ‌రాల్లోకి వెళితే.. రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో ఆదివారం నాడు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టగా ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

అయితే ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎన్. రవి శంకర్ (N.Ravi Shankar) చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాం అయ్యాయి. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) గురించి మాట్లాడిన రవి శంకర్, “మా హీరోతో నటించే స్థాయికి సరిపడే హీరోయిన్ కోసం నెలల తరబడి వెతికాం. చివరకు రుక్మిణి వసంత్‌లో ఆ ప్రతిభ కనిపించింది. ఆమె అసాధారణమైన నటి. అయితే మా అన్న (ఎన్టీఆర్) స్థాయికి పూర్తిగా సరిపోలక పోయినా కనీసం 80% ఇస్తుందని ఆశిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో స‌ద‌రు నిర్మాత‌ను ట్రోల్ చేస్తున్నారు. మీరు చేసే ఓవర్ యాక్షన్‌కే 10% ఉండదు అని ఎద్దేవా చేశారు. మరొకరు, అంటే ఇంతకాలం ఎన్టీఆర్‌తో సినిమాలు చేసిన హీరోయిన్స్ అన్నీ వృథా అనమాట అంటూ ప్రశ్నించారు. ఇంకొకరు, ఇలాంటి వారందరికీ స్టేజ్ మీద మాట్లాడే ముందు స్క్రిప్ట్ రెడీ చేసి ఇవ్వాలని మ‌రికొంద‌రు వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ వ‌చ్చారు.

ఇక చాలా మంది అభిమానులు, హీరోని పొగిడితే పొగ‌డండి కానీ హీరోయిన్‌ రుక్మిణిని తగ్గించి మాట్లాడటం ఎందుకు?” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ని అవమానించడం ఏంటి? అని మరో అభిమాని రాసాడు. మొత్తానికి, ఎన్టీఆర్‌ని పొగడటానికి రుక్మిణి వసంత్ ప్రతిభను తక్కువ చేసి మాట్లాడిన‌న రవి శంకర్ వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ నిర్మాత ముందుకు వ‌చ్చి ఏదైనా వివ‌ర‌ణ ఇస్తేనే గానీ ఈ వివాదం ఓ కొలిక్కి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

Updated Date - Sep 30 , 2025 | 06:10 PM