RT76: సంక్రాంతి బరిలో.. రవితేజ
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:26 AM
రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గురువారం ఈ చిత్రాన్ని ప్రారంభించి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రవితేజ ఓ విమానం...
రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గురువారం ఈ చిత్రాన్ని ప్రారంభించి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రవితేజ ఓ విమానం సీటులో సూట్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ‘ఆర్‌టీ76’ వర్కింగ్ టైటిల్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘‘దర్శకుడు కిశోర్ తిరుమల అద్భుతమైన స్ర్కిప్ట్ సిద్ధం చేశారు. ఈ సినిమా రవితేజ మార్క్ కామెడీతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, డీఓపీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.