సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mowgli Teaser: మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రంరా..అదిరిపోయిన మోగ్లీ టీజర్

ABN, Publish Date - Nov 12 , 2025 | 05:23 PM

యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala) బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Mowgli

Mowgli Teaser: యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala) బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రోషన్ రెండో సినిమా మోగ్లీ (Mowgli) రిలీజ్ కు రెడీ అవుతోంది. కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రోషన్ సరసన సాక్షి మండోద్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా మోగ్లీ టీజర్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సీత, రాముడు, రావణుడు.. ఈ పాత్రలతోనే మోగ్లీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీస్ అవ్వాలనుకొనే ఒక యువకుడు ఎన్నో కష్టాలు పడుతూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. మొదటి చూపులోనే ఒక అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి.. ఆమె తన సీత అని.. తానే ఆమె రాముడని నమ్ముతాడు. ఇక సీతారాములు ఉంటే కచ్చితంగా రావణుడు ఉంటాడు. ఇక ఈ జంట ప్రేమ కథలోకి పోలీస్ అనే రావణుడు ఎంటర్ అవుతాడు. ఆ తరువాత ఏంటి అనేది కథగా తెలుస్తోంది.

టీజర్ మొత్తంలో డైలాగ్స్ బాగా పేలాయి. మనకెందుకు మాయ్యా.. కోపాలు ఇవి. పావుగంట నవ్వితేనే బుగ్గలు నొప్పి వస్తాయి. అలాంటిది జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే ఎలా..?, మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రంరా..ఏడుపొస్తే ఏడవలేం.. నొప్పేస్తే చూపించుకోలేం.. అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక కాల భైరవ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాకు హైలైట్ అంటే బండి సరోజ్ కుమార్ విలనిజం అని నెటిజన్స్ అంటున్నారు. మోగ్లీ సినిమా డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 12 , 2025 | 05:39 PM