Rithu Chowdhary: రెచ్చిపోయిన రీతూ.. బీచ్ ఒడ్డున బికినీలో
ABN , Publish Date - Jul 05 , 2025 | 07:51 PM
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎంత ఎక్కువ గ్లామర్ చూపిస్తే అంత ఎక్కువ అవకాశాలు వస్తాయి. అన్ని ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి.
Rithu Chowdhary: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎంత ఎక్కువ గ్లామర్ చూపిస్తే అంత ఎక్కువ అవకాశాలు వస్తాయి. అన్ని ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. ఒకప్పుడు గ్లామర్ అంటే.. స్టార్ హీరోయిన్స్ మాత్రమే చేస్తారు అనుకునేవారు. కానీ, సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు కూడా స్టార్ హీరోయిన్ లా మారిపోతున్నారు. విచ్చలవిడిగా ఫోటోలు పెట్టేస్తున్నారు. ఇక అలాంటివారిని నెటిజన్స్ వైరల్ చేసేస్తున్నారు. తాజాగా ఒక సీరియల్ నటి బికినీలో సోషల్ మీడియాను మొత్తం బెంబేలెత్తించింది. ఆమె ఎవరో కాదు రీతూ చౌదరి (Rithu Chowdhary). సోషల్ ఎక్కువ ఫాలో అయ్యేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించి సీరియల్ లో నటిస్తూ వస్తున్న రీతూ దశను మార్చింది జబర్దస్త్. ఆ షోలో కొద్దిసేపు కనిపించినా అమ్మడికి బాగానే గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వరుస షోస్ లో కనిపిస్తూ ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ట్రోల్స్ ద్వారా ఎదిగిన నటీమణుల్లో అమ్మడు కూడా ఉంది అని చెప్పొచ్చు. హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేయడం... నెటిజన్స్ వాటిని ట్రోల్ చేయడంతో రీతూ మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈమధ్యనే రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో రీతూ పేరు కూడా వినిపించింది. ఈ స్కామ్ వలన అప్పటివరకు కొంతమందికే తెలిసిన ఈ చిన్నది ఆ తరువాత అందరికీ తెల్సింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని క్లివేజ్ షో, థైస్ షో చేస్తూ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. కొందరు కవ్విస్తుంది అని అంటుండగా.. ఇంకొందరు సిగ్గులేదు అనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినా కూడా రీతూ అస్సలు తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతుంది.
తాజాగా రీతూ చౌదరి హద్దులు దాటేసింది. బీచ్ వెకేషన్ కు వెళ్లిన ఆమె ఈసారి మరింత గా బోల్డ్ గా కనిపించి ఇచ్చింది షాక్ ఇచ్చింది. ఇక ఇందులో అమ్మడు కింద షార్ట్.. పైన ఎద అందాలను మరింత చూపించే టాప్ వేసుకొని కిక్కెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు కూడా చాలా ట్రోలింగ్ కు గురైంది. ఛీఛీ.. అవకాశాల కోసం ఇలాంటి ఫోటోలు కూడా పెడుతున్నావా అని కొందరు.. టాలెంట్ చూపిస్తుంది భయ్యా అని మరికొందరు కామెంట్స్ పెడుతుండగా.. ఇంకొందరు మాత్రం సూపర్ సూపర్ అంటూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
Trivikram- Venkatesh: వెంకీమామ సరసన ఆ ఇద్దరు భామలు..?