Rishab Shetty: తెలుగులో.. రిషబ్ షెట్టి పీరియడ్ డ్రామా! ఫస్ట్ లుక్ అదిరింది
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:50 AM
కాంతార స్టార్ రిషబ్ షెట్టి హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెరపైకి వస్తోంది.
టాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రానికి తెర లేచింది. కన్నడ నటుడు కాంతార స్టార్ రిషబ్ షెట్టి (Rishab Shetty) హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెరపైకి వస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) నాగవంశీ (Naga Vamsi) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు ఆకాశ వాణి (Aakashavaani) మూవీ ఫేం అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) దర్శకత్వం వహించనున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ బుధవారం ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీకి ది ల్యాండ్ బర్న్‌డ్ ఎ రెబల్ రోజ్ అనే క్యాప్సన్ ఇచ్చారు. 18 వ శతాబ్ధంలో బెంగాల్‌లో జరిగిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల బ్యాగ్రౌండ్‌లో హిస్టారికల్ పీరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కునుంది.
ఇదిలాఉంటే ప్రస్తుతం రిషబ్ (Rishab Shetty) తెలుగులో ప్రశాంత్ వర్మ జై హనుమాన్‌లో నటిస్తోండగా ఛత్రపతి శివాజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అంతేగాక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతార చాఫ్టర్ 1 మరో నెల పదిహేను రోజుల్లో థియేటర్లలోకి రానుంది.