RGV: బాలకృష్ణ సినిమాలు చూడను.. చిరంజీవితో సినిమా చేయడం చేతకాదు
ABN, Publish Date - Nov 19 , 2025 | 09:21 PM
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి విషయాన్నీ ఆయినా వివాదంగా మార్చడంలో వర్మ ముందు ఉంటాడు. అయితే ఇప్పుడు వర్మలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందులా సోషల్ మీడియాలో వివాదాస్పదం అయ్యే ఏ వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ, చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఒక ఇంటర్వ్యూలో వర్మ చిరంజీవితో సినిమా ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు. చిరంజీవితో సినిమా చేసే కెపాసిటీ నాకు లేదు. నా సెన్సిబిలిటీలో ఆయనకున్న రేంజ్ కి, అయన మీద ఆయన అభిమానులు పెట్టుకున్న అంచనాలకు సెట్ అవ్వదు. చిరంజీవితో సినిమా చేయను అని అనను... అసలు ఆయనతో సినిమా చేయడం నాకు చేతకాదు. అందుకే నేను చేయను' అని చెప్పుకొచ్చాడు.
ఇక నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నేను బాలకృష్ణ సినిమాలు చూడలేదు. చూడను. ఎప్పుడో 20, 30 ఏళ్ళ క్రితం చూసాను. ఎందుకు చూడను అంటే అది నా సెన్సిబిలిటీ కాదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. వర్మ ఈ రేంజ్ గా స్టార్ హీరోల గురించి మాట్లాడడం షాకింగ్ గా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక శివ రీ రిలీజ్ తరువాత ఒక ప్రాజెక్ట్ ని ఓకే చేసిన వర్మ.. ఆ సినిమాతో తానేంటో నిరూపించుకుంటానని చెప్పుకొచ్చాడు. మరి వర్మ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.