Ram Gopal Varma: ‘శివ’ సీక్వెల్ తీస్తే ఎవరితో.. వర్మ ఏమన్నారంటే..
ABN, Publish Date - Nov 11 , 2025 | 11:48 AM
శివ సినిమా విడుదలై ఇప్పటికి 36 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఆ సినిమా ఓ ట్రెండ్. ఎంతగా అంటే ‘శివ సినిమాకు ముందు.. ఆ తర్వాత’ అనేంతగా.
శివ (Shiva 4K Release) సినిమా విడుదలై ఇప్పటికి 36 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఆ సినిమా ఓ ట్రెండ్. ఎంతగా అంటే ‘శివ సినిమాకు ముందు.. ఆ తర్వాత’ అనేంతగా. నాగార్జున, అమల జంటగా రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal varma) దర్శకత్వం వహించిన ఈ చిత్రం టాలీవుడ్ ధోరణిని మార్చేసిన చిత్రాల్లో ఒకటని సినీ ప్రముఖులు అంటారు. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రం నూతన హంగులతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి టెక్నాలజీతో, టాల్బీ అట్మాస్ (Dolby atmos) సౌండ్‌తో ఈ నెల 14న రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ మాట్లాడారు.
‘మళ్లీ ‘శివ’ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారన్న ప్రశ్నకు ‘శివ’ (Shiva Sequel) సినిమా నాగార్జున కోసమేనని, ఆయన్ను తప్ప మరొకరని ఆ సినిమాలో ఊహించుకోలేనని వర్మ అన్నారు. ‘ఒకవేళ సీక్వెల్ చేయాల్సి వస్తే నాగచైతన్య, అఖిల్‌లో ఎవరిని హీరోగా తీసుకుంటారు?’ అన్న ప్రశ్నకు ఇద్దరిలో ఎవరూ కాదని ఆర్‌జీవీ స్పందించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడు ఏ సినిమాలోనూ హీరో టెన్షన్ పడే సన్నివేశాలు ఉండటం లేదు. ఇంట్రడక్షన్ సీన్ లేదా సాంగ్‌తోనే హీరో ఏదైనా చేసేస్తాడని చెబుతున్నారు. కానీ ‘శివ’లో హీరో ఓ సాధారణ వ్యక్తి. అలా ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు ఎవరూ చేయట్లేదు కనుక మళ్లీ ‘శివ’కు మీరు కనెక్ట్ అవుతారు. ఈ సినిమా విషయంలో సాంకేతికంగా సవాల్ అనిపించిన అంశం సౌండ్ డిజైనింగే. ఒరిజినల్ వెర్షన్‌లోని ఫ్లేవర్ పోకుండా దాన్ని అంతే ప్రభావవంతంగా 4కె ఆట్మాస్ వెర్షన్‌లో చూపించగలిగాం’ అని ఆర్‌జీవీ అన్నారు.
ALSO READ: Honey Rose: హనీ రోజ్ పెద్ద సాహసమే ఇది
Globe Trotter Song: సంచారి .. సంచారి.. సాహసమే తన దారి.. శృతిహాసన్ అదరగొట్టేసింది
KH 237: ‘కమల్ 237’లో మాలీవుడ్ టెక్నీషియన్లకు ప్రాధాన్యం