Rajendra Prasad: మరోసారి వాయిదా పడ్డ 'సఃకుటుంబానాం'

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:44 PM

డిసెంబర్ 19వ తేదీన విడుదల కావాల్సిన సఃకుటుంబానాం సినిమాను కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోతున్నామని, త్వరలో కొత్త విడుదల తేదీని తెలియచేస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది.

Sahakutumbaanam Movie

ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'సఃకుటుంబానాం' (Sahakutumbaanam). రామ్ కిరణ్ (Ram Kiran), మేఘ ఆకాష్ (Megha Akash) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), 'శుభలేఖ' సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ (Mani Sharma) ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి ప్రశంసలు లభించాయి. అయితే డిసెంబర్ 19వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోతున్నామని, త్వరలో కొత్త విడుదల తేదీని తెలియచేస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది.

Also Read: Sara Arjun : చివరి వరకూ అది 'దురంధర్' అని తెలియదట...

Also Read: Pavani Rao Boddapati: అవతార్ విజువల్ వెనకున్నది మనమ్మాయే

Updated Date - Dec 18 , 2025 | 03:44 PM