సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sujeeth: సుజీత్‌ ఎంత పని చేశావయ్యా.. నీ అభిమానం ఆ రేంజ్‌లో ఉంది

ABN, Publish Date - Dec 19 , 2025 | 02:54 PM

‘ఓజీ’ (Og) దర్శకుడు సుజీత్‌కు (Sujeeth) పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan Kalyan) ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే!

‘ఓజీ’ (Og) దర్శకుడు సుజీత్‌కు (Sujeeth) పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan Kalyan) ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే! అంత ఖరీదైన బహుమతి ఇవ్వడం వెనకు పెద్ద కథే ఉందట. ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన ఓ కీలక షెడ్యూల్‌ జపాన్‌లో చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే బడ్జెట్‌ పరిమితుల కారణంగా విదేశీ షూట్‌కు ప్రొడక్షన్‌ హౌస్‌ అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ, ఆ సన్నివేశాలు సినిమాకు ఎంతో కీలకం. సినిమా నిలబడాలంటే ఆ సన్నివేశాలు తప్పనిసరి అని సుజీత్‌ బలంగా నమ్మాడు. తన విజన్‌కు కట్టుబడి ఉండాలనే సంకల్పంతో సుజీత్‌ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. షూటింగ్‌ ఖర్చుల కోసం తన ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారును అమ్మేసి డబ్బు సమకూర్చాడు.

ఈ విషయం పవన్‌ కళ్యాణ్‌కు తెలిసిన వెంటనే, డైరెక్టర్‌ అంకితభావం ఆయనను ఎంతో కదిలించింది. వెంటనే ఆయన స్వయంగా సుజీత్‌కు అదే ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు దర్శకుడు, హీరో పవన్‌ను ప్రశంసలతో ముంచేస్తున్నారు. ‘హిట్‌ సినిమా ఇచ్చిందుకు పవన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ కాదిది.చచ దర్శకుడి అంకితభావానికి విజన్‌కు ఇచ్చిన గౌరవం అని ప్రశంసిస్తున్నారు.


పవన్‌కల్యాణ్‌, ప్రియాంక ఆరుల్‌ మోహన్‌ జంటగా నటించిన గ్యాంగ్‌స్టర్‌ చిత్రం ఓజీ. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మించారు. సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది.

Updated Date - Dec 19 , 2025 | 02:56 PM