Raviteja: పరాజయాలతో పనేంటి.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:54 PM

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Raviteja) హిట్ అందుకొని దగ్గర దగ్గర మూడేళ్లు అవుతుంది. ధమాకా తరువాత రవితేజ హీరోగా నటించిన ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Raviteja

Raviteja: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Raviteja) హిట్ అందుకొని దగ్గర దగ్గర మూడేళ్లు అవుతుంది. ధమాకా తరువాత రవితేజ హీరోగా నటించిన ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మధ్యలో వాల్తేరు వీరయ్య ఉన్నా అది చిరంజీవి ఖాతాలోకి పడుతుంది. విజయాపజయాలను లెక్కచేయకుండా రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, రవితేజకు కమ్ బ్యాక్ ఇచ్చే సినిమా ఏది ఇప్పటివరకు రాలేదు. పరాజయాలు వచ్చినా కూడా రవితేజకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

మాస్ జాతర పరాజయాన్ని అందుకున్నా కూడా వెంటనే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను పట్టాలెక్కించేశాడు రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. ఇంకా ఈ సినిమాను పూర్తే చేయలేదు మాస్ మహారాజా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో కిక్ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ లుక్, కామెడీ, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.

ఇక కిక్ కి సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత సురేందర్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ, హీరోలు మాత్రం డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చారు. చివరగా సురేందర్ రెడ్డి ఏజెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఒకటి ఉండాలి. అది ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనేది ఆ దేవుడికే తెలియాలి. ఇక తాజాగా ఈ డైరెక్టర్ .. మరోసారి తనకు హిట్ ఇచ్చిన రవితేజనే నమ్ముకున్నాడని తెలుస్తోంది. రెవితేజ - సురేందర్ రెడ్డి కాంబో మరోసారి రిపీట్ కానుందని సమాచారం. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని టాక్. మరి ప్రస్తుతం ప్లాప్ లో ఉన్న ఈ ఇద్దరూ కలిసి మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తారా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Dec 16 , 2025 | 06:55 PM