Ravi Teja - Siddhu: ఇన్నాళ్లకు రవితేజ తన కోరిక బయటపెట్డాడు..
ABN , Publish Date - Oct 12 , 2025 | 02:36 PM
రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిద్ధూ జొన్నలగడ్డ. తాజాగా ఆయన నటించిన ‘తెలుసు కదా’ చిత్రం విడుదల సందర్భంగా ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. రవితేజ, సిద్థు ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
రవితేజ (Raviteja) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) తాజాగా ఆయన నటించిన ‘తెలుసు కదా’ (telusu kada) చిత్రం విడుదల సందర్భంగా ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. రవితేజ, సిద్థు ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. కొన్నాళ్ల క్రితం రవితేజ బయోపిక్‌ను ప్లాన్ చేసినట్టు సిద్థు చెప్పారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదలైన తర్వాత రెండు నెలలపాటు ఆ బయోపిక్ కోసం కసరత్తు చేశానని తెలిపారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదన్నారు. సిద్ధూ మాటలకు రవితేజ స్పందిస్తూ ‘ఓ వ్యక్తి చరిత్రను సినిమా తీసేటప్పుడు అన్ని పాజిటివ్ యాంగిల్‌లోనే ఉంటాయి. సినిమాలో పాజిటివ్ మాత్రమే కాదు.. నెగటివ్ కూడా ఉండాలి’ అని రవితేజ అన్నారు. (Raviteja Biopic)
దానికి సిద్ధూ బదులిస్తూ.. నేను అలాగే ప్రయత్నించాలనుకున్నానని సిద్థు తెలిపారు. దీనికి రవితేజ బదులిస్తూ ‘‘చూద్దాం.. భవిష్యత్తులో జరుగుతుందేమో’ అంటూ తాను కూడా ఓ నటుడి జీవిత చరిత్రలో నటించాలనుకున్నానని చెప్పారు. సిద్థు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతుంది. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది. ఇక రవితేజ విషయానికొస్తే ఆయన ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నారు. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.