సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Razor Glimpse: దేవుడా.. ఒక మనిషిని ఇంత బ్రూటల్ గా నరుకుతారా

ABN, Publish Date - Dec 24 , 2025 | 02:46 PM

నటుడు చలపతిరావు నట వారసుడిగా రవిబాబు (Ravibabu) ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. విలన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన.. అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మారాడు.

Razor Glimpse

Razor Glimpse: నటుడు చలపతిరావు నట వారసుడిగా రవిబాబు (Ravibabu) ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. విలన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన.. అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే కామెడీ.. లేకపోతే హర్రర్ సినిమాలతో హిట్స్ అందుకున్న రవిబాబు.. అవును 2 తరువాత డైరెక్టర్ గా వెనుకబడ్డాడు. ఈ మధ్యనే ఏనుగుతొండం ఘటికాచలం అనే సినిమాను తెరకెక్కించాడు. అది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం రవిబాబు తనను తాను రుజువు చేసుకొనే పనిలో పడ్డాడని తెలుస్తోంది. అందులో భాగంగానే ఒక మంచి కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రవిబాబు నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న సినిమా రేజర్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అంతా రక్తపాతంతో నిండిపోయింది. ఒక మనిషిని బ్రూటల్ గా నరికిన్నట్లు చూపించారు.

చేతులు రెండు తాళ్లకు కట్టేసి.. బాడీ మొత్తం నరికేశారు. తల ఒకవైపు .. బాడీ ఓ వైపు పడేశారు. ఒక చిన్న గ్లింప్స్ లోనే ఇంత రక్తపాతం చూపించారు. ఇక దానికి న్యాయం చాలా క్రూరంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను మేకర్స్ తెలుపలేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రవిబాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 24 , 2025 | 02:56 PM