Raviteja: రవితేజతో.. 'విశ్వంభర వశిష్ట'! ఆల్మోస్ట్‌ ఫైనల్‌

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:00 PM

సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు రవితేజ (Ravi Teja). అంతే కాదు కొత్త దర్శకులకూ అవకాశాలిస్తారు. ఎంతో మంది దర్శకులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారాయన.

సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు రవితేజ (Ravi Teja). అంతే కాదు కొత్త దర్శకులకూ అవకాశాలిస్తారు. ఎంతో మంది దర్శకులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారాయన. ప్రస్తుతం ఆయన నటించిన ‘మాస్‌ జాతర’ (Mass Jathara)విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నారు. ఇవి కాకుండా మరో సినిమాకు ఆయన శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ‘బింబిసార’ సూపర్‌హిట్‌  అందుకుని రెండో సినిమాకే మెగాస్టార్‌ చిరంజీవిని (Chiranjeevi) డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు దర్శకుడు వశిష్ఠ మల్లిడి (Vassista to Direct Raviteja).

వీరిద్దరి కాంబోలో ‘విశ్వంభర’ తెరకెక్కుతుంది. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల కానుంది. ఇప్పుడు రవితేజను డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారట వశిష్ట రూ.45 కోట్లు బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కినుందని, అందులో రూ.25 కోట్లు బడ్జెట్‌ రవితేజ పెట్టనున్నారని తెలిసింది. ప్రస్తుతం వశిష్ఠ విశ్వంభర సీజీ వర్స్క్‌తో బిజీగా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందనే తెలియాల్సి ఉంది. విభ్వంభర రిలీజ్‌కు మరో ఏడెనిమిది నెలలు సమయం ఉంది కాబట్టి.. ఈలోపు రవితేజ సినిమా మొదలెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే బింబిసార కంటే ముందుగానే వశిష్ట, రవితేజతో సినిమా చేయాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడే అదే రవితేజతో వశిష్ట మళ్లీ సినిమా చేయబోతున్నాడు.    

Updated Date - Oct 26 , 2025 | 05:12 PM