Mass Maharaja: రవితేజ కొత్త మూవీకి హిస్టారికల్ టైటిల్
ABN , Publish Date - May 31 , 2025 | 05:39 PM
మాస్ మహరాజా రవితేజ సినిమాల స్పీడ్ పెంచాడు. ఒక సినిమా కంప్లీట్ కాక ముందే మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజాగా క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మూవీకి హిస్టారికల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారట.
మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) అంటే మాస్ సినిమాలకే కేరాఫ్ అడ్రస్! అలాంటి మాసోడికి సరిపోయే కథ పడితే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. నాలుగేళ్ళ క్రితం వచ్చిన 'క్రాక్ (Krack) ', రెండేళ్ళ క్రితం వచ్చిన 'ధమాకా' (Dhamaka ) సినిమాలే ఇందుకు ఎగ్జాంపుల్స్. కానీ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు రవితేజ. అయినప్పటికీ సాలిడ్ హిట్ కోసం మినీ వార్ చేస్తున్నాడు. అయితే... ఈ మధ్య కథల ఎంపికలో కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తున్నాడు. పరాజయాలు రవితేజ ను వెంటాడుతున్నా... అప్పుడప్పుడు ప్రయోగాలకు రెడీ అవుతుంటాడు. రీసెంట్ గా అలాంటి ప్రయోగంతో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
వరుస ఫ్లాపులు ఖాతాలో ఉన్నా... రవితేజ లైనప్ దిమ్మతిరిగేలా ఉంది. ప్రెజెంట్ రవితేజ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'మాస్ జాతర' (Mass Jathara) ఆగస్ట్ 27న రిలీజ్ కాబోతోంది. వినాయక చవితితో పాటు లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేలా రిలీజ్ డేట్ ను ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. దీంతో మూవీని శరవేగంగా ఫినిష్ చేయాలను కుంటున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న కొత్త మూవీకి పెడుతున్న హిస్టారికల్ టైటిల్ అప్పుడే ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది.
మాములుగా రవితేజ మూవీలకు టైటిల్స్ క్యాచీ గా ఉండటంతో పాటు పవర్ ఫుల్ గా కూడా ఉంటాయి. కానీ జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. క్లాస్ మూవీలతో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కిశోర్ తిరుమల (Kishore Tirumala) తో మూవీ చేయనున్నాడు మాసోడు. జూన్ లో మొదలు కానున్న ఈ మూవీకి 'అనార్కలి' (Anarkali) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. టైటిల్ ను బట్టి చూస్తే రవితేజ సలీంగా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. సహజంగా కిషోర్ తిరుమల రాసుకునే స్టోరీ సాధారణ మాస్ మసాలా మూవీస్‌లా ఉండదు. సో... ఫీల్ గుడ్ అంశాలతో సరికొత్త స్టోరీతో రవితేజను జనం ముందు నిలుపబోతున్నాడని తెలుస్తోంది. కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri)నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతిని టార్గెట్ పెట్టుకుని ఈ మూవీని కంప్లీట్ చేస్తారట. మరి హిస్టారికల్ టైటిల్ తో రవితేజ ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తాడో చూడాలి.