Spirit: స్పిరిట్ డైరెక్షన్ టీమ్ తో మెగాస్టార్.. ఆ స్టార్స్ కొడుకులను గుర్తించారా..
ABN, Publish Date - Nov 23 , 2025 | 05:35 PM
ఎప్పుడెప్పుడా అని ఎదుచూసిన సమయం వచ్చేసింది. ఎట్టకేలకు ప్రభాస్ (Prabhas)- సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న స్పిరిట్ (Spirit) పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది.
Spirit: ఎప్పుడెప్పుడా అని ఎదుచూసిన సమయం వచ్చేసింది. ఎట్టకేలకు ప్రభాస్ (Prabhas)- సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న స్పిరిట్ (Spirit) పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. హీరో మెగాస్టార్ చిరంజీవి(C ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. సందీప్ రెడ్డి వంగాకు.. చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెల్సిందే. ఆయన చేతుల మీదగాని క్లాప్ కొట్టించి సినిమాను మొదలుపెట్టించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ టీమ్ మొత్తం చిరుతో కలిసి ఒక ఫోటో దిగారు. అందులో ఇద్దరు స్టార్ వారసులు కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి ఈ సినిమాకు ఇద్దరు స్టార్ వారసులు పనిచేస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. వారు ఎవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి. వీరిద్దరూ సందీప్ రెడ్డి కింద అసిస్టెంట్స్ గా పనిచేయనున్నారు.
సాధారణంగా హీరో కొడుకు హీరోగా మారడం చూస్తూనే ఉన్నాం. కానీ, మహాధన్ మాత్రం కొద్దిగా రూటు మార్చి డైరెక్షన్ లో మెళుకువలు నేర్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. అందుకే తండ్రి దగ్గర నటన కాకుండా సందీప్ దగ్గర డైరెక్షన్ నేర్చుకోవడానికి సిద్దమయ్యాడు. ఇక రిషి సైతం త్రివిక్రమ్ దగ్గర కాకుండా సందీప్ దగ్గర నేర్చుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు స్టార్ వారసులు తమ మొదటి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.