Rashmika Mandanna: మొన్న విజయ్.. నేడు రష్మిక.. రింగ్ చూపించి కన్ఫర్మ్ చేస్తున్నారా
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:40 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)- రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ల నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)- రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ల నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఇప్పటివరకు ఈ జంట ఆ విషయాన్నీ బయటపెట్టింది లేదు. ఎప్పుడెప్పుడు ఈ జంట అధికారికంగా తమ నిశ్చితార్దాన్ని అధికారికంగా ప్రకటిస్తారా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
నిశ్చితార్థం అయ్యిన తరువాతి రోజునే విజయ్ పుట్టపర్తి వెళ్తూ మీడియా కంటికి కనిపించాడు. ఇక అప్పుడు విజయ్ చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ ఉండడంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందని అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక తాజాగా రష్మిక సైతం మొదటిసారి తన చేతికి రింగ్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే రష్మిక తాజాగా తాన్ పెట్ డాగ్ తో ముచ్చట్లు చెప్తూ కనిపించింది.
రష్మిక తన పెట్ డాగ్ తో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఫోన్ లో థామా సాంగ్ ను డాగ్ కు చూపిస్తూ అందులో ఉన్నది ఎవరు అని అడుగుతుంది. ఆ వీడియో చూడడానికి చాలా ముద్దుగా ఉంది. కానీ, అందరి చూపు మాత్రం రష్మిక చేతికి ఉన్న రింగ్ మీదనే పడింది. ఎంతో అద్భుతంగా ఉన్న ఆ డైమండ్ రింగ్.. విజయ్ పెట్టిందే అని తెలుస్తోంద. దీంతో ఇలా ఒకరికొకరు రింగ్స్ చూపిస్తూ సరిపెట్టడమేనా.. లేక అధికారికంగా ప్రకటించేది ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఎన్నాళ్లు దాస్తారో మేము చూస్తాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.
Santhana Prapthirasthu: బాలల దినోత్సవం రోజు.. 'సంతాన ప్రాప్తిరస్తు'
Mitra Mandali Censor Review: మిత్ర మండలి.. సినిమా సెన్సార్ రివ్యూ! పెద్ద మ్యాటరే ఉంది