Mitra Mandali Censor Review: మిత్ర మండలి.. సినిమా సెన్సార్ రివ్యూ! పెద్ద మ్యాటరే ఉంది
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:26 PM
మీడియం రేంజ్ మూవీలతో భారీ హిట్లు కొడుతున్నారు నిర్మాత బన్నీ వాసు. రీసెంట్ గా 'లిటిల్ హార్ట్స్' మూవీని మిత్రుడు వంశీతో కలిసి ఆయనే పంపిణీ చేశారు.
టాలీవుడ్ లో ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు పెరిగిపోతున్నాయి. తక్కువ బడ్జెట్ లో మంచి కథనంతో సినిమాలు తీస్తూ మేకర్స్ విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి కోవలోనే చేరనుంది ‘మిత్ర మండలి’ (Mithra Mandali) సినిమా. ప్రియదర్శి (Priyadarshi) , నిహారిక ఎన్ ఎం (Niharika Nm) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఇచ్చిన ప్రశంసలు ఆసక్తి రేపుతున్నాయి.
‘మిత్ర మండలి’ ఒక బడ్డీ కామెడీగా రూపొందినప్పటికీ... సమాజంలోని వ్యవస్థలపై సున్నితమైన సెటైర్‌తో సాగిందని తెలుస్తోంది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డు సభ్యులు మెచ్చుకున్నారట. ఆద్యంతం వినోదభరితంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కిందని వారు ప్రశంసించారట. ఈ సినిమా కేవలం నవ్వించడమే కాకుండా, ఆలోచింపజేసే సందేశాన్ని కూడా అందించడం బాగుందని వారు అభిప్రాయపడ్డారట. ఈ కారణంతో ‘మిత్ర మండలి’కి ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు.
'మిత్ర మండలి’లో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జోడీ ఒక హైలెట్‌గా నిలవనుందని అంటున్నారు. వీరి ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని తెలుస్తోంది. అలాగే, విష్ణు ఓయి (Vishnu Oi) , రాగ్ మయూర్ (Rag Mayu) , ప్రసాద్ బెహరా (Prasad Behara) కామెడీ ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక స్పెషల్ అట్రాక్షన్‌గా వెన్నెల కిషోర్ (Vennela Kishore ) , సత్య (Satya) , వీటీవీ గణేష్ (VTV Ganesh ) తమదైన హాస్యంతో అలరించనున్నారని టాక్. అంతేకాదు, ఈ చిత్రంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా కనిపించనున్నారు. మొత్తంగా ఈ స్టార్ కాస్ట్‌తో ‘మిత్ర మండలి’ ప్రేక్షకులకు ఒక ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా మారనుందని, దీపావళిని ఈ సినిమా నవ్వుల పండుగ గా మార్చడం ఖాయమని డిస్కస్ చేసుకుంటున్నారు.
Read Also: Allu Arjun - Atlee: కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం.. ఒక రేంజ్‌లో ఉంటుంది..
Read Also: Alia Bhatt: మరో తెలుగు సినిమాలో.. ఆలియాభట్! నిజమేనా