Vijay Deverakonda: నన్ను ఎవడైనా ఏమైనా అంటే.. నేను రివర్స్‌లో వెళ్తా! కానీ రష్.. అలా కాదు
ABN, Publish Date - Nov 13 , 2025 | 06:50 AM
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) సక్సెస్‌మీట్ బుధవారం జరిగింది.
రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) సక్సెస్‌మీట్ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ రోజే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా చూశాను. చాలా సార్లు కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను చూసిన గొప్ప చిత్రాల్లో ఇదొకటి. అందరి అమ్మాయిల్లానే రష్మిక కూడా వేధింపులు ఎదుర్కొన్నారు.
ఆమె కెరీర్‌లో ఎదిగిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నన్ను ఎవడైనా ఏమైనా అంటే నేను రివర్స్‌లో వెళ్తాను. కానీ రష్మిక మాత్రం తనను ఎగతాళి చేసినా పట్టించుకోకుండా తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. తనొక అద్భుతమైన మహిళ. ప్రపంచం ఏదో ఒక రోజు నీ సత్తా తెలుసుకుంటుంది అని చెప్పాను. అది నిజమైంది’ అని ప్రశంసించారు. కాగా విజయ్ మాటలకు రష్మిక కన్నీళ్లు పెట్టింది.
అనంతరం.. రష్మిక మాట్లాడుతూ.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) సినిమా ప్రారంభం నుంచి విజయవంతమయ్యే వరకూ ఈ చిత్రంలో విజయ్ కూడా వ్యక్తిగతంగా ఒక భాగంగా ఉన్నాడని పేర్కొంది.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అదొక ఆశీర్వాదం’ అని కథానాయిక రష్మిక మందన్న (Rashmika Mandanna) అన్నారు.